తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినా భక్తులు శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత, తిరుమల దగ్గర్లో ఉన్న అన్ని దేవాలయాలు దర్శించుకుంటారు. పాపవినాశనం కానిపాకం చివరగా శ్రీకాళహస్తి దర్శించుకుంటారు. ఇక చివరిగా శ్రీకాళహస్తి దర్శించుకున్న తర్వాత మరే దేవాలయానికి వెళ్ళకూడదు అని చెబుతారు అలా వెళితే అరిష్టమని ఆచారం హిందూ సంప్రదాయంలో కొనసాగుతూ వస్తుంది. అసలు ఎందుకు అలా చేయాలి శ్రీకాళహస్తి దేవాలయాన్నిఎందుకు దర్శించుకోవాలి, శ్రీ కాళహస్తి దర్శనం తర్వాత మరే గుడికి ఎందుకు వెళ్ళకూడదు, వెళితే ఏమవుతుంది నేరుగా ఇంటికే ఎందుకు వెళ్లాలి అనే విషయాలు తెలుసుకుందాం. పంచభూతాల నిలయం ఈ విశ్వం గాలి, నింగి, నేల ,,నీరు
నిప్పు ఇవి పంచభూతాలు వీటికి ప్రతితగా భూమి మీద పంచభూతలింగాలు వెలసాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి లోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన వాయులింగం అయితే ఇక్కడ దర్శంణం చేసుకున్న తర్వాత ఇతర దేవాలయాలకు వెల్ల కూడదు అనే ఆచారం ఉంది . అందులో నిజం లేకపోలేదు సర్ప దోషం రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతుంది. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనంతో సర్ప దోషం తొలుగుతుంది, ప్రత్యేక పూజలు చేసుకున్న తర్వాత నేరుగా ఇంటికె వెళ్ళమని చెబుతారు. ఇక్కడ పూజలు వలన దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలు వదిలేసి ఇంటికి వెళ్ళాలి అని, తిరిగి ఇతర దేవాలయాల కానీ మరి ఎక్కడికి వెళ్ళినా దోష నివారణ ఉండదనేది ప్రతిదీ. అలాగే గ్రహణాలు పరమశివుడికి ఉండవని మిగతా అందరి దేవుళ్ళకి శని ప్రభావం, గ్రహణ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.
దీనికి మరో ఆధారం చంద్రగ్రహణం ఈరోజున కలియుగం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం సహా అన్ని దేవాలయాల మూసివేస్తారు, గ్రహణానంతరం శుద్ధి జరిపిన తర్వాత పూజలు నిర్వహిస్తారు. కానీ గ్రహణ సమయంలో శ్రీ కాళ హస్తి దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది అంతే కాదు రోజంతా ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక దైవదర్శనం అవసరం లేదని నీతి. మనుషులందరూ ఏడాదిలో ఒక్కసారైనా సరే శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి అక్కడ ఉన్న రాహుకేతు పూజలు చేయించుకుని అక్కడ ఉన్న స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల జీవితంలో వచ్చే అనేక ఒడిదుడుకులు నుండి గట్టెక్కవచ్చు అలాగే రాహు కేతు అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతుంటారు.