//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వేలానికి శ్రీ దేవి చీర ... ఎంత ధర పలుకుతుందో

Category : movies

శ్రీదేవి .. ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రజల అతిలోక సుందరి కళ్ళ ముందు నిలుస్తుంది. తెలుగు సినీ ప్రపంచాన్ని ఓ రేంజ్ కు తీసుకెళ్ళిన శ్రీదేవి తెలుగు వారి మనస్సులో ఎప్పటికీ "పదహారేళ్ళ వయసు " ఉన్న తారనే .. అందర్నీ దుఃఖ సాగరంలో ముంచిన శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లి సంవత్సరం కావస్తుంది.

అభిమానులనుండి అతిలోక సుందరి శ్రీదేవి దూరమై ఫిబ్రవరి 24 వ తేదీకి సంవత్సరం అవుతోంది. దీంతో శ్రీదేవి తొలి వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నాలు ప్రారంభించారు. శ్రీదేవి వర్ధంతి రోజు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఈ క్రమంలో శ్రీదేవి కట్టుకున్నచీరను వేలం వేసి వచ్చిన డబ్బుతో ఆమె పేరుమీద దాన ధర్మాలు చేయాలనీ అనుకున్నారు. దీంతో శ్రీదేవి ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఓ 'కోటా చీర'ను 'పరిసెరా' వెబ్‌సైట్‌లో వేలానికి ఉంచారు.

ప్రారంభ వేలం ధరని రూ. 40 వేలకు నిర్ణయించగా బుధవారం సాయంత్రానికి అది రూ.90 వేలకు చేరింది. శ్రీదేవి వర్ధంతిఫిబ్రవరి 24 నాటికి ఈ చీర రికార్డు ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు.

Related News