//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దివికేగిన ‘అతిలోకసుందరి’! Sridevi Passes Away

Category : national

లెజండరీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి ఇక లేరు.

బాలీవుడ్ నటుడు మొహిత్ మార్వా వివాహం నిమిత్తం భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషి కపూర్‌తో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. సడెన్‌గా హార్ట్ ఎటాక్ రావడంతో ఈ లోకం విడిచి వెళ్లినట్లుగా బాలీవుడ్ వర్గాలు ప్రకటించాయి.

దడాక్ చిత్ర షూటింగ్ కారణంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఈ పెళ్ళికి వెళ్లలేదని సమాచారం. ఇప్పటికే శ్రీదేవి ఇంటికి వారి ఫ్యామిలీ సన్నిహితులు, సినీరంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ విషయం తెలియగానే జాన్వీ కూడా షూటింగ్ నుండి వెళ్ళిపోయినట్లుగా సమాచారం.

శ్రీదేవి హార్ట్ ఎటాక్‌తో మరిణించారనే విషయం తెలిసిన సినిమా రంగం ఒక్కసారిగా షాక్‌కి గురయింది. సోషల్ మీడియా అంతా ఈ వార్త స్ప్రెడ్ అయింది. శ్రీదేవి మరణించారనే వార్తని నెటిజన్స్ నమ్మలేకపోతున్నారు.