//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్‌బాస్ నుంచి శ్రీ‌రెడ్డి ఔట్‌...!!

Category : movies

బిగ్‌బాస్‌కు అంతా సిద్ధ‌మ‌వుతోంది. జూన్‌లో ప్రారంభం కానున్న ఈ షోలో పాల్గొనే పాటిస్పెంట్స్ ఎంపిక విష‌యంలో ఛానెల్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. అతిపెద్ద షో క‌నుక జాగ్ర‌త్త‌లు తీసుకొని మ‌రీ ఈ షోకు ఏర్పాట్లు చేస్తోంది. కాగా, తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో జ‌రుగుతున్న క్యాస్టింగ్ కౌచ్‌పై, అలాగే, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసి పాపుల‌ర్ అయిన శ్రీరెడ్డిని బిగ్‌బాస్‌లోకి తీసుకోవాల‌ని బిగ్‌బాస్ షో నిర్వ‌హించే ఛానెల్ ప్ర‌య‌త్నం చేసింద‌ట‌. శ్రీ‌రెడ్డి లాంటి వివాద‌స్ప‌ద న‌టిని తీసుకుంటే బిగ్‌బాస్ షోకు పిచ్చ రేటింగ్ వ‌స్తుంద‌ని భావించింద‌ట‌. కానీ, ఈ ప్ర‌య‌త్నాల‌కు ఆదిలోనే హంస‌పాదు ఎదురైంది.

శ్రీ‌రెడ్డిని బిగ్‌బాస్‌లోకి తీసుకుందామ‌ని దాదాపు డిసైడ్ అయిన స్టార్ మాకు అద్దిరిపోయే షాక్ ఇచ్చాడ‌ట ఆ షోకు హోస్ట్‌గా చేస్తున్న‌నేచుర‌ల్ స్టార్ నాని. శ్రీ‌రెడ్డిని బిగ్‌బాస్‌లోకి రానివ్వ‌కుండా ప్ర‌ధానంగా అడ్డుకున్న‌ది అత‌డేన‌ట‌. నానిపై శ్రీ‌రెడ్డి గ‌తంలో చాలానే కామెంట్లు చేసింది. హీరోయిన్ల‌ను వాడుకుంటాడ‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. ఈ నేప‌థ్యంలో బిగ్‌బాస్‌లోకి శ్రీ‌రెడ్డిని తీసుకుంటే తాను బిగ్ బాస్ షో నుంచి వైదొలుగుతాన‌ని నాని హెచ్చ‌రించాడ‌ట‌. దీంతో బిగ్‌బాస్ షో నిర్వాహ‌కులు శ్రీ‌రెడ్డిని తీసుకోవాల‌నే నిర్ణ‌యాన్ని విర‌మించుకున్నారు. ఇలా నాని వ‌ల్లే శ్రీ‌రెడ్డి బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవ‌కాశం కోల్పోయిందంటూ టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే, హీరోలంద‌రిలో మంచి మ‌న‌సున్న నాని ఇలాంటి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం లేద‌ని, బిగ్‌బాస్ షో నుంచి శ్రీ‌రెడ్డిని తొల‌గించేలా ఓ బ‌డా ప్రొడ్యూస‌ర్‌తోపాటు అత‌ని కుమారుడు నాని చేత చెప్పించారంటూ టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.