Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

"రెడ్డి డైరీ" గా శ్రీరెడ్డి బయోపిక్.....!

Category : movies

కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలతో టాలీవుడ్‌, కోలీవుడ్‌ వర్గాల్లో అలజడి రేపిన తెలుగు నటి శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరతీసింది. రెడ్డి డైరీ పేరుతో ఆమె స్వీయ చరిత్రను తమిళంలో తెరకెక్కించనున్నట్టు తెలిపింది.

ఈ మేరకు చెన్నై ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అల్లావుద్దీన్‌ మాట్లాడుతూ... శ్రీరెడ్డి జీవితంలో చోటుచేసుకున్న వాస్తవ సంఘటనల ఆధారంగా ‘రెడ్డి డైరీ’ని రూపొందిస్తున్నామని చెప్పారు.

శ్రీరెడ్డి మాట్లాడుతూ..... తనను మోసగించిన వారి ఆధారాలు తన వద్ద ఉన్నాయని, సమయం వచ్చినపుడు వాటిని బయటపెడతానని హెచ్చరించింది. తాను నటించబోయే రెడ్డి డైరీ చిత్రానికి సహకరించేందుకు నడిగర్‌ సంఘం హామీ ఇచ్చిందని చెప్పింది. కాస్టింగ్‌ కౌచ్‌పై తన ఆరోపణల జాబితా కొనసాగుతుందని, తనను లైంగికంగా వాడుకున్న వారి వీడియో ఆధారాలన్నీ తన వద్దే ఉన్నాయని తెలిపింది. రెడ్డి డైరీ చిత్రం ద్వారా వాటిని విడుదల చేయనున్నట్లు బాంబు పేల్చింది.

Related News