//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ద‌య‌చేసి నాకు అవ‌కాశాలు ఇవ్వండి.. నేను నావి దాచుకోకుండా చూపిస్తా..!

Category : movies

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిల‌కు అవ‌కాశాలు రావ‌డం చాలా క‌ష్టం. అవ‌కాశాలు వ‌చ్చినా.. రాణించిన సందర్భాలు చాలా అరుదు, ఇంకా చెప్పాలంటే అసలు లేదనే చెప్పాలి. ఇంట గెలవకపోయినా రచ్చ మాత్రం గట్టిగానే గెలిచారు మనమ్మాయిలు. అందుకే తెలుగులో పెద్దగా స్టార్ డమ్ కానీ ఇమేజ్ కానీ సొంతం చేసుకోలేకపోయినా.. తమిళనాట మాత్రం వరుస ఆఫర్స్ సొంతం చేసుకొని తమ సత్తా చాటారు.

సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు ఫేం.. అంజలి, అవ‌కాయ బిర్యాని ఫేం- బింధుమాధవి, బ‌స్‌స్టాప్ ఫేం శ్రీదివ్య , ఇదే ఫార్మాట్ లో స్టార్ హీరోయిన్స్ అయినవాళ్ళే. అయితే ఇప్పుడు వీళ్ళందరికీ ఆఫర్లు తగ్గిపోయాయి. కొత్త భామల రాకతో వీరిని పట్టించుకొనే పరిస్థితి కరువైంది. అందుకే.. మళ్ళీ తమ మాతృభాషలో ఆఫర్ల కోసం ప్రయత్నాలు మొదలెట్టారు.

దీంతో నిన్నమొన్నటివరకూ నేను స్కిన్ షో చేయను, గ్లామర్ పాత్రలకు నేను దూరమంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చిన శ్రీదివ్య.. ఇప్పుడు గ్లామర్ రోల్స్‌కి రెడీ.. బికినీ వేయ‌డానికి రెడీ.. లిప్‌లాక్‌కు రెడీ.. అంటూ మీడియాకి లీకులు ఇచ్చేసింది. పాపం అవకాశాలు తక్కువవ్వడంతో ఇలా గ్లామర్ పాత్రలకు రెడీ అని చెప్పడంతో ఆమెను చూసి జాలిపడేవాళ్లు లేకపోలేదు. జాలి పడుతున్నారు బానే ఉంది కానీ.. తన అందాల కోసం ఆఫర్లు ఇచ్చేవాళ్లెవరా అని ఆశగా ఎదురుచూస్తోంది శ్రీదివ్య. మ‌రి శ్రీదివ్య ఆఫ‌ర్‌ని ఏ డైరెక్ట‌ర్ యూజ్ చేసుకుంటాడో చూడాలి.