//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శ్రీదేవి బాబాయి వేణు గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు : రాత్రిల్లో మద్యం సేవించేది

Category : national

శ్రీదేవి మద్రాసులో పుట్టి పెరిగినా ఆమె కుటుంబ మూలాలు ఆంధ్రాలోనే ఉన్నాయి. తిరుపతిలో ఆమెకు చాలా మంది బంధువులు ఉన్నారు. శ్రీదేవి మరణం నేపథ్యంలో ఆమె బాబాయ్ వేణుగోపాల్ రెడ్డి ఐడ్రీమ్స్ కి ఇంటర్వ్యు ఇచ్చారు. ఆయన ఆ ఇంటర్వ్యులో పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చారు.

శ్రీ దేవి సినీ రంగ ప్రవేశం, బాల నటిగా శ్రీదేవి ఎంతో అద్భుతమైన ప్రదర్శన చూసి దర్శక నిర్మాతలు ఆమెకు వరుస అవకాశాలు ఇచ్చారని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు. చిన్న తనం నుండి నటిస్తూ ఉండటం వల్ల శ్రీదేవి బడికి, కాలేజీకి వెళ్లి చదువుకోలేదు. మద్రాసులో ఒక టీచర్ ఇంటికి వచ్చి ఆమెకు చదువు చెప్పేవారు. హైస్కూలు, కాలేజీ మొహం శ్రీదేవి అసలు ఎరుగదు అని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.శ్రీదేవి ముఖానికి కొన్ని సర్జరీలు చేయించుకున్న మాట నిజమే అని ఆయన అన్నారు.

బోనీ కపూర్‌తో వివాహం శ్రీదేవి తల్లికి అసలు ఇష్టం లేదు. కానీ వారిద్దరూ ఆల్రెడీ కమిట్ అయ్యారు. అంతకు ముందు రెండు మూడు సార్లు బోనీ ఇంటికి వస్తే ఆమె కసిరి పంపివేసింది. శ్రీదేవి తల్లి మెదడు తప్పుడు ఆపరేషన్ వల్ల మతిస్థిమితం కోల్పోయింది, ఆమె సరిగా ఉంటు బోనీతో శ్రీదేవి పెళ్లి జరిగేది కాదేమో... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు. శ్రీదేవి తల్లి అమెరికా ఆసుపత్రిలో ఉన్న సమయంలో బోనీ కపూర్ చేదోడు వాదోడుగా ఉన్నాడు. అప్పుడు వారి మధ్య ప్రేమ చిగురించి ఉండచ్చు అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

నటి శ్రీదేవిని ఆర్థికపరమైన ఇబ్బందులే బాగా కుంగదీశాయని, వాటి వల్ల మానసిక సంఘర్షణ పడేది అని ఆమె చిన్నాన్న వేణుగోపాల్ రెడ్డి అన్నారు. పెళ్ళి తర్వాతే శ్రీదేవి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అవి ఆమె చేసిన అప్పులు కాదు. బోనీ కపూర్ సినిమాలు చేసి నష్టపోయాడు. ఆ డబ్బును శ్రీదేవి ఆస్తులు అమ్మి కవర్ చేశారు.... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

శ్రీదేవి మనసులో అప్పులకు సంబంధించి బాధ ఉండేది. అప్పులు తీర్చడానికి చెన్నైలో కూడా శ్రీదేవికి చెందిన చాలా ఇళ్లులు అమ్మారు. జీవితాంతం కష్టంతోనే బ్రతికింది, కష్టంతోనే పోయింది. ఆమెకు ఎప్పుడూ మనశ్శాంతి అనేది లేదు..... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు. శ్రీదేవి రాత్రి వేళల్లో మద్యం సేవించేదని మా వాళ్ళు చెప్పారు.. కానీ నేను ప్రత్యక్షంగా చూడలేదని వేణుగోపాల్ రెడ్డి చెప్పారు.

శ్రీదేవి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. పుట్టిన సమయం నుండి కష్టాల్లోనే ఉంది. వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగింది. సినిమాలు తగ్గించిన తర్వాత పిల్లల పెంపకం మీద పడింది. వారే సర్వస్వంగా బ్రతికింది. బోనీ కపూర్ మీద అనుమానం లేదు. మాకు తెలిసినంత వరకు శ్రీదేవిని బాగా చూసుకున్నారు.... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు. శ్రీదేవి వంటి మంచి వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధించిందని, తన ఇద్దరు పిల్లలను ఆర్థికంగా నిలబెట్టాలని శ్రీదేవి ఎంతో తాపత్రయ పడుతూ ఉండేదని చెప్పారు.