//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సెలబ్రేషన్ క్లబ్ కు శ్రీదేవి భౌతికకాయం తరలింపు

Category : national

ముంబై లోఖండ్ వాలా ప్రాంతంలోని గ్రీన్ ఎకర్స్ లో ఉన్న నివాసం నుంచి శ్రీదేవి భౌతికకాయాన్ని సెలబ్రేషన్ క్లబ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో అక్క ఆమె అభిమానులు పోటెత్తారు. తమ అభిమాన కథానాయికను చివరిసారి చూడాలనే తపనతో వేలాది మంది అక్కడకు తరలివచ్చారు.

మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆమె భౌతికకాయాన్ని సందర్శించుకోవడానికి అనుమతిస్తారు. ఆ తర్వాత 2 గంటలకు అక్కడి నుంచి ఆమె అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల మధ్యలో ఆమె అంత్యక్రియలను నిర్వహించబోతున్నారు.

మరోవైపు శ్రీదేవిని కడసారి చూసేందుకోసం బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రేషన్ క్లబ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related News