ఐపీఎల్లో భాగంగా ఈ రోజు సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఏడు మ్యాచ్‌లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా ఆరు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ 3 విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
మరో సారి సన్ రైజర్స్ జట్టు బౌలింగ్ గే ప్రధాన ఆయుధం గా బరి లోకి దిగుతుంది. రాజస్థాన్ ఏ మ్యాచ్ లో నైనా గెలిచి తమ హవాను చూపాలని తెగ ఆరాటపడుతుంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు: అజింక్యా రహానే (కెప్టెన్), రాహుల్ త్రిపాఠీ, సంజు శాంసన్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, కృష్ణప్ప గౌతమ్, జోఫ్రా ఆర్చర్, మహిపాల్ లోమ్రోర్, జయదేవ్ ఉనద్కత్, ధవల్ కుల్కర్ణి, ఇష్ సోధీ
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: శిఖర్ ధవన్, అలెక్స్ హేల్స్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీష్ పాండే, షకీబల్ హసన్, యూసుఫ్ పఠాన్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రషీద్ ఖాన్, బాసిల్ థంపి, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ