ఎన్నో విజయాలు సాధించి మన దేశ ప్రతిష్టను పెంచిన షటిల్ స్టార్ పీవీ.సింధుకి మరో ఘనత దక్కననుంది.స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఏడాది ప్రకటించే ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు భారత ఏస్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఎంపికైంది. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఎస్జేఎఫ్ఐ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకు న్నారు. భారత జూనియర్ హాకీ జట్టును ‘బెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు వరించింది. గత డిసెంబర్లో లక్నో వేదికగా జరిగిన జూనియర్ ప్రపంచకప్లో భారత హాకీ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. గతేడాది జూలై నుంచి ఈ సంవత్సరం జూన్ వరకు ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులకు ప్రకటించారు. ఇక సెప్టెంబర్లో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు.