ప్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లో టాపీసీడ్స్ సునాయాసంగా రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఢిపెండింగ్ ఛాంపియన్లు జకోవిచ్, ముగురుజలు సునాయాసంగా తొలి హర్డిల్‌ను అధిగమించారు. ఫ్రెంచ్ ఓపెన్ పదో టైటిల్‌పై కన్నేసిన స్పెయిన్ బుల్ నాదల్ తొలి రౌండ్లో సునాయాసంగా విజయం సాధించి రెండో రౌండ్‌కు ప్రవేశించాడు. బెనిట్ పెయిరీ(ఫ్రాన్స్)పై 6-1, 6-4,6-1తో నాదల్ జయకేతనం ఎగుర వేశాడు. రెండో రౌండ్లో డచ్ ఆటగాడు రాబిన్ హసేతో తలపడనున్నాడు. రెండో సీడ్ జకోవిచ్(సెర్బియా) మార్సెల్ గ్రానోలర్స్(స్పెయిన్)పై 6-3, 6-4,6-2తో విజయం సాధించాడు. డేవిడ్ గుఫిన్ (బెల్జియం) పాల్ హెన్రీ (ఫ్రాన్స్)పై 6-2,6-2,6-2తో జయభేరి మోగించాడు. ఐదో సీడ్ మిలోస్ రోనిక్ (కెనడా) స్టీవ్ డార్సిస్ (బెల్జియం)పై 6-3,6-4,6-2తోను, ఏడో సీడ్ మారిన్ సిలిక్ (క్రోయేషియా) గులిబిస్ (లాత్వియా) 6-3,6-3,6-3తోను, బెదానే (బ్రిటన్) హారిసన్ (అమెరికా)పై 6-4,6-0,3-6,6-1తోను విజయం సాధించి రెండో రౌండ్‌కు ప్రవేశించారు. మహిళల విభాగంలో కరోలినా వోజ్నియాకి(డెన్మార్క్) జామియా పోర్లిస్ (ఆస్ట్రేలియా)పై 6-4, 3-6,6-2తో గట్టెక్కింది. ఢిఫెండింగ్ ఛాంపియన్, నాలుగో సీడ్ గార్బైన్ ముగురుజ (స్పెయిన్) ప్రాన్సెసా చివవోన్పై 6-2,6-4తో జయకేతనం ఎగుర వేసింది.