Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భర్తతో విడిపోయి..ప్రియుడితో కలిసి చోరీలు

Posted 2 months ago | Category : national

ప్రయాణికుల్లా నటిస్తూ తోటి ప్రయాణికుల హ్యాండ్‌ బ్యాగుల నుంచి నగల్ని కాజేస్తున్న మహరాష్ట్రకు చెందిన ఐదుగురు సభ్యుల ముఠాను ఖాజీపేట్‌ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ 27 లక్షల విలువచేసే 90 తులాల బంగారు ఆభరణాలు, రూ 90 వేల నగదును స్వాధీనం చేసుకొని రైల్వే కోర్టుకు తరలించారు. బుధవారం సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్‌చార్జి ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ కేసు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర షోలాపూర్‌ జిల్లా కర్మలా తాలూకాకు చెందిన దీపక్‌ భార్య శోభా దీపక్‌(22) భర్తతో విడిపోయి కిశోర్‌ అనే వ్యక్తితో మంచిర్యాల జిల్లా రామగుండంలో అద్దెకు ఉంటున్నారు.

శోభా, కిషోర్‌ ఉంటున్న ఇంట్లోనే దన్‌రాజ్‌ హరికాళే, (28), భగవన్‌దాస్‌ పవార్‌(38), మహాదేవ్‌ అశోక్‌ కాళే(28) ఉంటారు. వీరు ఇజీగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనాలను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌ రైల్వే ఏరియా పరిధిలోని ఖాజిపేట్‌ రైల్వే స్టేషన్‌లో రెండు రోజుల క్రితం పద్మ అనే మహిళా బ్యాగులోంచి 37.5 తులాల బంగారు నగల్ని కొట్టేశారు. బాధితురాలు పద్మ వెంటనే 1512 రైల్వే పోలీస్‌ కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసింది.

అప్రమత్తమైన ఖాజిపేట్‌ రైల్వే పోలీసులు, రైల్వే రక్షణ దళం(ఆర్పీఎఫ్‌) కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఖాజిపేట్‌ రైల్వే స్టేషన్‌లో అనుమానితుల బ్యాగుల్ని తనిఖీ చేశారు. ప్లాట్‌ ఫాంపై కూర్చోని ఉన్న శోభ బ్యాగులో నగలు కనిపించడంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించింది. ఖాజిపేట్‌ సీఐ వెంకటేష్‌, ఖాజిపేట్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ దయాకర్‌, ఎస్సై జితేదర్‌, మంచిర్యాల్‌ సీఐ బన్సీలాల్‌లతో పాటు రైల్వే పోలీస్‌ బృందం శోభ ఇంటి అడ్రస్‌ సేకరించి ఇంట్లో తనిఖీలు చేశారు. ఇంట్లో ఉన్న దన్‌రాజ్‌ కాళే, భగవన్‌దాస్‌, మహదేవ్‌ అశోక్‌లను అదుపులోకి తీసుకుని, మొత్తం 90 తులాల ఆభరణాలు, రూ 90వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠా సభ్యు లు ఖాజిపేట్‌ రైల్వే పోలీస్టేషన్‌ పరిధిలో ఇప్పటి వరకు 8 చోరీలు, మంచిర్యాల్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో 7 చోరీలు, వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో రెండు చోరీలు, డోర్నోకల్‌ రైల్వే స్టేషన్‌లో ఒక చోరీ చేసినట్లు ఇన్‌చార్జి డీఎస్పీ చెప్పారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే