//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కార్తిక స్నానం విశిష్టత

Category : national

కార్తీక మాసంలో నదీ స్నానం తప్పనిసరిగా చేయాలన్నారు పెద్దలు. నదీస్నానం చేయటం అంటే మనకి దగ్గరలో ఉన్న నదిని వదిలి పెట్టి ఎక్కడో ఉన్న నదిలో స్నానం చేయకూడదు ఎందుకంటే మనకి మన దగ్గర లో ఉన్న నదే కదా అన్నం పెట్టేది. అయితే ఈ స్నానం వెనుక ఒక రహస్యం ఉందండి అదేంటంటే ఈ మాసం లో చేసే నదీ స్నానం మనుషుల ఆరోగ్యాన్ని పెంపోదిస్తుంది. కార్తిక మాసంలో చంద్రుడి తేజస్సతో పాటు సూర్యుడి కిరణాల వల్ల నది నీటికి ప్రతేక్యమైన శక్తి కలుగుతుంది. ఇలాంటి నీటిలో మజ్జనం చేయాలి.మజ్జనం అంటే మూడు సార్లు తల ముంచి పైకి లేవాలి. దీని వల్ల మనకి అమృత స్పర్శ కలుగుతుంది.ఎందుకుంటే ఈ స్నానం నదిలో నిలబడి పరమేశ్వరుడికి నమస్కారం చేస్తాము కాబట్టి. అయితే స్నానం మాత్రం ఒంటి మీద బట్టలతో చేయాలి చేసేటపుడు మనసులో గట్టి సంకల్పం ఉండాలి. అంతే కాదు స్నానం చేసేటపుడు పుణ్య నదులను వాటి పేర్లను తలచుకుంటూ మజ్జనం చేయాలి. ఈ స్నానం చేసి వచ్చిన తర్వాత దానం చేయటం వంటి  పుణ్యకార్యాలు చేయాలి. దీని వలన పుణ్యం కలుగుతుంది.