లక్ష కోట్లు. ముఖ్యమంత్రి పీఠం కోసం తండ్రి మృతదేహాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసిన వ్యక్తి. 16 నెలలు జైలు అనుభవం. ప్రతీ శుక్రవారం సీబీఐ కోర్టు, ప్రజల కోసం కాకుండా వ్యక్తి కోసం పనిచేసే టీవీ ఛానెల్, దానికి అనుసంధానంగా ఓ పత్రిక ఈ మాటలను విన్నవెంటనే ఏపీ ప్రజలకే కాకుండా, దేశ వ్యాప్త రాజకీయాల గురించి ఆలోచించే ప్రతీ ఒక్కరికి గుర్తొచ్చే ఏకైక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. అయ్యబాబోయ్.. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదండి బాబు స్వయాన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, ఏపీ సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం కార్యదర్శి పెనుమల్లి మధు ఇలా ప్రతీ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు వైసీపీ అధినేత జగన్‌ను పొద్దొస్తుమానం ఆడిపోసుకుంటున్న విషయం ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. తాము ఈ విధంగా వైస్ జగన్ మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడానికి తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ మీడియా ఎదుట ప్రవేశ పెట్టడం మరో వంతు.
ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో ఏపీ వ్యాప్తంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు విస్తృత దాడులు చేసిన విషయం తెలిసిందే. పారిశ్రామిక వేత్తలను భయభ్రాంతులకు గురిచేసేలా ఈ దాడులు జరిగాయని, మా అనుమతులు లేకుండా.. ఏపీలో పెట్టుబడులు ఎలా పెడతారు..? అన్న రీతిలో కేంద్ర ప్రభుత్వం ఏపీ పారిశ్రామిక వేత్తలపై ఐటీ దాడులు చేయించిందని ప్రతీ సామాన్యుడు అభిప్రాయపడ్డాడు. చివరకు అక్రమాలకు పాల్పడ్డట్టు ఎటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో తీసుకొచ్చిన ఖాళీ సూట్ కేసులతో వెనుదిరిగారు ఐటీ అధికారులు. ఇలా, ఎటువంటి ఫిర్యాదు లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఐటీ దాడులు చేయించడంపై ప్రతీ సామాన్యుడు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. వైసీపీ మినహా మిగతా ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు సైతం ఐటీ దాడులను ఏపీపై కేంద్ర కుట్రగా పరిగణించాయి. మీడియా వేదికగా మోడీపై ధ్వజమెత్తాయి.
కానీ, ఒక్క వ్యక్తి మాత్రం ఈ విషయంపై అందరికీ భిన్నంగా స్పందించారు. అతనే వైఎస్ జగన్. ఇంతకీ ఐటీ దాడులపై జగన్ ఏమన్నారంటే..? ఆంధ్రప్రదేశ్‌పై ఐటీ దాడులేంటి..? కాదు.. కాదు..! ఎవరో కొందరు పారిశ్రామిక వేత్తలను టార్గెట్ గా చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేస్తే.. వాటిని ఏపీపై ఐటీ దాడులుగా ఎలా పరిగణిస్తారు..? అంటూ ప్రశ్నించారు. అయితే, జగన్ ఇలా స్పందించడానికి అసలు కారణం వేరే ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఇంతకీ, వారు చెబుతున్న ఆ కారణం ఏమిటంటే..? గతంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్లకు పైగా అక్రమ సంపదను ఆర్జించారని ఫైల్ అయిన కేసు విచాణలో భాగంగా సీబీఐ, ఐటీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే విషయాన్ని వైసీపీ అధినేత, ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అప్పుడు జరిగిన దాడులను ఏపీపై జరిగిన ఐటీ దాడులుగా పరిగణించలేదని, అటువంటిది ఇటీవల జరిగిన ఐటీ దాడులను..ఏపీపై దాడులుగా ఎలా పరిగణిస్తారు..? తూచ్.. తూచ్..! అంటూ మీడియా ముందు గగ్గోలు పెడుతున్నారు.
ఇలా, చెబుతున్న జగన్.. వైసీపీ నేతల మాటలను విన్న సామాన్యుడు వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. నీ వద్ద లక్ష కోట్లు ఉన్నట్టు సీబీఐ, ఐటీ వద్ద ఆధారాలు ఉన్నాయి. అందుకే నీపై నాడు సీబీఐ, ఐటీ దాడులు జరిగాయి. ఆ క్రమంలోనే నీవు 16 నెలలపాటు జైలు జీవితాన్ని గడిపావు. చిప్పకూడు తిన్నావు అంటూ సెటైర్లు వేస్తున్నారు. సామాన్యుడికి తోడు నెటిజన్లు సైతం నెట్టిల్లు వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి, సామాన్యులు చెబుతున్న మాట నిజమో.. కాదో మీరే చెప్పాలి.