//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అంటారు ఎందుకో తెలుసా ?

Category : editorial

ఉల్లి చేసే మేలు.. తల్లి కూడా చేయదనే సామెత వినే ఉంటారు.ఉల్లిగడ్డలను కోసినప్పుడు వాటిలో ఉండే ఎంజైమ్స్ విడుదలవుతాయి. వాటితోపాటుగా ఘాటై సల్ఫర్‌ గ్యాస్ కూడా బయటికి వస్తుంది. ఇదే కళ్లకు చిరాకు కలిగించి కన్నీరు పెట్టిస్తుంది. ఏడిపించినా మన ఆరోగ్యానికి సంజీవిని లాంటిది ఉల్లిపాయ. కొన్ని శతాబ్దాలుగా ఈ ఉల్లిగడ్డలు మన ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అతి తక్కువ ధరకు దొరికే వీటిని పేదల ఆహారంగా కూడా చెబుతారు. మన ఇళ్లలో ఉల్లిపాయను వాడని వారు చాలా తక్కువగా వుంటారు. ఉల్లిపాయలో ఘాటైన వాసనే కాదు, శక్తివంతమైన ఆహారవిలువలు కూడా ఎన్నో ఉన్నాయి. ఉల్లిపాయలో ఉండే ఆహారవిలువలు ఉల్లికారాన్ని బట్టీ, పక్వానికి వచ్చిన స్థితిని బట్టీ, ఎంతకాలం నిల్వ ఉన్నదన్నదాన్ని బట్టీ మారిపోతుంటాయి.

ఈ ఉల్లి మేలు.. కేవలం ఆరోగ్యానికే పరిమితం కాలేదు.. అందం కూడా తెచ్చిపెడుతుంది. చర్మ రక్షణకు అవసరమైన పోషకాలు బోలెడన్నీ ఉల్లిలో ఉన్నాయి. అందుకే.. ఉల్లిని ఉపయోగించి.. మీ సౌందర్యాన్ని మరింత పెంచుకోవచ్చు.. ఎలాగో ఇప్పుడు చూద్దాం...బ్లాక్ పిగ్మెంటేషన్ వల్ల చాలా మందికి ముఖం నల్లగా మారుతుంది. అంతేకాకుండా పొడిగా మారుతుంది. అలాంటప్పుడు ఉల్లిరసంలో కొద్దిగా శెనగపిండి, పాలమీద పెగడ కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చొప్పున.. నాలుగు వారాలు చేస్తే.. మంచి ఫలితం లభిస్తుంది.చర్మం నీర్జవంగా మారి.. కళావిహీనంగా మారినవారు.. ఉల్లి రసాన్ని నేరుగా ముఖానికి రాసుకొని... కాసేపు ఆరనిచ్చి.. తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. కోల్పోయిన జీవాన్ని తిరిగి పొందుతుంది.దోమలు, పురుగులు కుట్టడం వల్ల కొందరికి వాపులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఉల్లిరసాన్ని రాస్తే.. మంచి ఫలితం కనపడుతుంది.

ఒక పెద్ద ఉల్లిగడ్డను తీసుకోని దానిని అడ్డంగా కోసి రాత్రి పూట మన కాళ్ళ కింద సాక్సులలో పెట్టి పడుకోవడం వలన. కాళ్ళ పగుళ్లు తగ్గి మృదువుగా మారి కాళ్లకు సరిపడ రక్త ప్రసరణ జరుగుతుంది. అలాగే కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి.ఇలా చేయడం వలన రక్తం శుద్ధి అవుతుంది అలాగే శరీరంలోని నీరంతా తగ్గుతుంది దానితో శరీరంలో జీర్ణక్రియ మెరుగవుతుంది.

ఈ వర్షాకాల సీజన్ లో ఉల్లిని కోసి దాని వాసనను చుస్తే జలుబు తొందరగా తగ్గుతుంది.కోసిన ఉల్లిని మన శరీరం పై రాసుకుంటే శరీరం పై ఉండే మచ్చలు పోతాయి అలాగే చర్మం కూడా మృదువుగా అవుతుంది.ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకుంటే ఊడిపోయిన జుట్టు మళ్ళీ పెరుగుతుంది.మన కురులు చాలా అందంగా నిగనిగలాడాలంటే ఉల్లి రసాన్ని స్నానం చేసే ముందు తలకు మర్దన చేయాలి.అలాగే ఉల్లిపాయలో అనేక రకాల క్యాన్సర్ కారకాలతో పోరాడే గుణం ఉంది. పచ్చి ఉల్లిపాయ ఎక్కువగా తినడం వలన పురుషులకు వీర్యం వృద్ధి ఎక్కువగా జరుగుతుంది.ఉల్లిపాయ శరీరంలోని రక్తం పల్చగా ఉండి కణాన్నింటికి ప్రసరించేందుకు ఉపయోగపడుతుంది. మరియు రక్తం గడ్డకట్టకుండా, రక్తకణాలను నుండి ఎరరక్తకణాలను నిరోధిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే గుండె లోపాలు లేదా కార్డియో వాస్కులార్ వ్యాధులు దారి తీయవచ్చు. గుండె జబ్బులతోనూ, బీపీతోనూ బాధపడే వాళ్లు రోజూ 100 గ్రాముల ఉల్లిని తీసుకోవటం చాలా మంచిది. కిడ్నీల సమస్యలతో బాధపడేవారు, ఆస్తమా తో ఇబ్బంది పడేవారికి ఒక సంజీవనిలా పని చేస్తుంది ఉల్లి . అందుకే అంటారు మన ఆరోగ్యం కాపాడే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యలేదు అని .