//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పవిత్రమైన హజ్ యాత్ర ప్రారంభం

Category : editorial

ముస్లింలకు ఎంతో  పవిత్రమైన హజ్ యాత్ర ప్రారంభం అవ్వబోతుంది..ఈ యాత్రలో ప్రపంచ దేశాలనుండి కొన్ని లక్షలమంది ముస్లింలు పాల్గొంటారు. మదీనా నుండి మక్కా వరకు సాగె ఈ హజ్ యాత్ర ని ముస్లిం గా పుట్టినందుకు ఒక్కసారైనా తప్పక చెయ్యాలి. హజ్ యాత్ర  అంటే ఏంటి? ఎందుకింత ప్రాముఖ్యం ? అంటే హజ్ అంటే  సంకల్పం తనలో వున్నా చెడుని వీడి మంచి జీవితాంతం కొనసాగిస్తానని హాజీలు సంకల్పించుకుంటారు. హాజీలంటే మరెవరు కాదు హజ్ యాత్రకు వెళ్లి వచ్చిన వారిని హాజీ అంటారు.  

అన్నీ మతాల్లోనూ దైవారాధన వుంది, కొలిచే విధానమే వేరు.. మూలం,  అర్థం పరమార్థం ఒక్కటే. ఇస్లాం మతం ముఖ్యంగా 5 క్రియ లపైనా నడుస్తోంది.  విశ్వాసం, ప్రార్ధనా, ఉపవాసం, దాన ధర్మాలు ,హజ్ యాత్ర.  ప్రతీ ముస్లిం వీటిని ఖచ్చింతంగా పాటించాలని ఇస్లాం మతం నిర్దేశిస్తోంది. సౌదీ అరేబియాలోని మక్కా క్షేత్రంలో అల్లా, అయన దూతలతో నిర్మిచుకున్న మస్జీద్ ను  బక్రీద్ పండగకు ముందు దర్శించుకోవడమే ఈ హజ్ యాత్రా యొక్క ముఖ్య ఉద్దేశ్యం.     

  పవిత్ర హజ్ యాత్రకు ఎంపిక అయినా వారిని ఆగస్టు 13 నుంచి 22 వ తేదీ వరకు ప్రత్యేక విమానాల్లో పంపడానికి తెలంగాణ లోని హజ్ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది.ఈ యేడు తెలుగు రాష్ట్రలనుండి సుమారు 2900 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నారు. అలాగే ఏపీ, కర్నాటక నుండి ఎంపికైన యాత్రికులు హైదరాబాద్ విమానాశ్రమం నుండి బయలుదేరేందుకు ఏర్పట్లు జరుగుతున్నాయి.            

మక్కా లేదా  మక్కాహ్ 'మక్కతుల్-ముకర్రమా ఇస్లామీయ పవిత్ర నగరానికి చేరుకోవడానికి నేరుగా విమానా సౌకర్యం లేదు, జిద్దా నగరంలో కింగ్ అబ్దుల్ అజీద్ అనే అంతర్జాతీయ  విమానాశ్రమం ఇక్కడికి దగ్గరగా ఉంటుంది. జెద్దా నుండి 73 కి.మీ ల ఎర్ర సముద్ర తీరా ప్రాంతంలో వున్నా ఇరుకైన లోయ ప్రాంతంలో ఉంటుంది. ఈ నగరంలో ముస్లిమేతర కుటుంబాలు కూడా నివసిస్తూన్నాయి. ఈ నగరపు నడిబొడ్డున మస్జీద్ అల్- హరమ్ ఉంటుంది,ఈ  మస్జీద్ చుట్టూ నగరం విస్తరించినట్లు కనిపిస్తుంది. ఇక్కడి కట్టడాలన్నీ ప్రాచీన నిర్మాణంలో  ముస్లిం సాంప్రదాయాన్ని తలపిస్తూవుంటాయి . ఇక్కడ మిగతా దేశాలతో పోల్చితే, జనసాంద్రత ఎక్కువే,అక్కడ పాత బస్తీలా కనిపించే ఇక్కడి వారంతా హాజీలో పని చేసేవారే కావడం విశేషం.

ఈ యాత్రకు ప్రతీ ఏటా దాదాపు 40 లక్షలమంది వస్తారు. హజ్ యాత్రలో భాగంగా పవిత్రమైన  మస్జీద్ అల్- హరమ్ లో పరమ పవిత్రమైన కాబా గృహం వుంది. ఇక్కడి వచ్చిన ముస్లింలందరూ వారి సాంప్రదాయంలో కాబా గృహం చుట్టూ ఏడు తఫాహ్ అనగా ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడికి ముస్లిమేతర కుటుంబాలకు నిషిద్ధం. గత ఏడాది నుండి ఈ హజ్ యాత్రకు నాలుగు నెలలు దాటినా గర్భిణులు రాకూడదంటూ నిషేధం విధించారు. చిన్నపిల్లలు కూడా హజ్ యాత్రలో పాల్గొనవచ్చు, కానీ దానికి వారి హజ్ విధులన్నీ వారి సంరక్షలు నేరవేర్చాలి.          

పవిత్రా స్థలమైన మక్కా ఆవిర్భావం ఎలా జరిగింది ? అనే విషయం చూస్తే మక్కా రాష్ట్రం యెక్క రాజధాని మక్కానగరం,ఇక్కడే జెద్దా కూడా ఉంటుంది. ఐతే ఈ నగర ఆవిర్భావం నాలుగువేల సంవత్సరాల క్రితం కొండల నడుమ, నిర్జలంగా చెట్టు చేమ ఏమి లేకుండా ,నిర్జీవంగా వున్నా బంజరుభూమిలో ఇబ్రహీం తన భార్య అయినా పోజిరాను కుమారుడు ఇస్మాయిల్ ను వదిలేసి వెళ్ళిపోతాడు. ఇలా వదిలేసి వెళ్ళిపోతారా ? పోజిరా అడిగితే .. అవును ఇది దైవజ్ఞా అంటాడు.ఇస్మాయిల్ కు దాహం వేయడం తో ఎక్కడా నీరు  కనిపించలేదు. ఆలా వెతుకుతూ ఉండగా వారికీ జమ్ జమ్ పవిత్ర పేరుగల  జలాశయం కనిపిస్తుంది.అక్కడ వారు దాహం తీర్చుకున్నారు .కాలక్రమంలో దైవాజ్ఞ  మేరకు ఇబ్రహీం తిరిగి అక్కడికి వచ్చి తన తనయుడు సహాయంతో 'కాబా' ని నిర్మించారు. ఆ తరువాత అక్కడో గ్రామం వెలసి  మక్కా నగరంగా వృద్ధి చెందింది.             

  6 వ శతాబ్దపు మధ్యకాలంలో ఉత్తర అరేబియాలో మూడు ప్రాంతాలుండేవి, అవన్నీ కూడా ఎర్ర సముద్ర తీరా ప్రాంతంలోను మరియు ఈ సముద్రానికి తూర్పునగల అరేబియా ఎడారికి మద్యన వున్నా నివాసయోగ్య ప్రాంతంలో కలవు. ఈ ప్రాంతాన్నేహిజాజ్  అని పిలుస్తారు. ఇది  మనుషులు నివసించాడనికి అనువైన ప్రదేశం.  ఈ హిజాజ్ మధ్య ప్రాంతంలో యస్రిప్ అనే పట్టణం వుంది దీన్నే ప్రస్తుతం మదీనా పిలుస్తున్నారు.మక్కాకు దగ్గరలోనే జమ్ జమ్ అనే భావి కలదు,ఇందులో నీటిని పవిత్రమైన జలంగా స్వీకరిస్తారు.

ఇక్కడ మరో పవిత్రమైన స్థలం కాబా కూడా వుంది, పూర్వం ఇక్కడ విగ్రహరాధన ఎక్కువగా ఉండేది.ఆ తరువాత మహ్మద్ ప్రవక్త ఇస్లాం మతన్నిఆవిష్కరించిన తరువాత ఈ కేంద్రం కాబా ఏకేశ్వరోపాసనా కేంద్రగా మారింది. హజ్ యాత్ర కి వచ్చే వారందికీ అక్కడి ప్రభత్వం అన్ని సదుపాయాలు చూసుకుంటుంది. మక్కాలో బస చేసి రాళ్లను ఏరి మూడు చోట్ల సైతాన్ ను ఆ రాళ్లతో కొట్టడం తో హజ్ పూర్తవుతుంది.  ఇక హజ్ యాత్ర చేసిన వారు అబద్దాలు ఆడకూడదు, పరస్త్రీ వ్యామోహం, ఇతరాలను మానసికంగా హింసించడంలాంటివి చెయ్యకూడదు. మక్కాను సందర్శించిన ప్రతీ ముస్లిం తమ జన్మ ధన్యమైందని భావిస్తారు.

ఉమ్రా చెయ్యాలనుకునే వ్యక్తి మీఖాత్ ప్రాంతం నుండి ఇహ్రం దీక్ష తీసుకొని మక్కా చేసుకున్నాకా కాబా గృహం చుట్టూ ప్రదక్షణలు చెయ్యాలి. పూర్తయ్యేక సఫా -మార్వాల మధ్య పరిగెత్తాలి. తరువాత ముఖమే ఇబ్రహీం వద్ద రకాతుల నమాజు చెయ్యాలి. తరువాత వెంట్రుకలు కత్తిరించుకోవాలి లేదా తల గొరిగించుకోవాలి. దాంతో ఇహ్రం దీక్ష పూర్తయినట్లు అవుతుంది . రంజాన్ మాసం లో ఉమ్రా చేస్తే హజ్ చేసిన పుణ్యం లభిస్తుంది.