Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి జీవిత విశేషాలు సంక్షిప్తంగా

Category : national state politics

*జననం. 25-12-01924, ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు
*తల్లిదండ్రలు క్రిష్ణాదేవి. క్రిష్ణాబీహారీ వాజ్ పేయి.


*జన్మస్థలం మద్యప్రదేస్ లోని గ్వాలియర్
*వాజ్ పేయి తొలిసారి 1942 లో క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా పోరాటం చేసారు
అందుకు బ్రిటీష్ ప్రభుత్వం 23 రోజులు జైల్లో పెట్టారు.
*ఆర్యసమాజ్ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా చేసారు.
*1939లో వాజ్ పేయి ఆర్ ఎస్ఎస్ చేరాడు 1947 లో పూర్తి స్థాయి ప్రచారక్ గా పనిచేసారు.
*1951 భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు.
*దీన్ దయాల్ ఉపాద్యాయ కు అనుచరుడు.


*1957లో మొదటి సారి లోక సభకు బలరాం పూర్ నుంచి ఎన్నికయ్యారు
*1968-73 వరకు భారతీయ జనసంఘ అధ్యక్షుడిగా పనిచేసారు.
*3,వ ,9, లోక్ సభకు తప్పా ప్రతి సభలో ఉన్నారు. ఆసందర్భంలో రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు.
*1977లో కేంద్ర జనతా సర్కార్ హాయాంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా చేసారు.
అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. గల్ఫ్ దేశాల్లో పనికోసం వెల్లే వారికి పాస్ పోర్టులు వీసాలు. ఇప్పించారు.
*1980-86 జనసంఘ్ బీజేపీ గా మారాకా భీజేపీ వ్యవస్థాపక అధ్యక్షులు.
*1982లో లొక సభలో ఇద్దరు సభ్యులున్న బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర.
*సహచరుడు ఆధ్వానితో కలిసి ఆనేక రాజకీయా ఉద్యమాలు చేసారు.
*రామజన్మభూమి యాత్ర తో బీజేపీ దశ తిరిగింది.
*వాజ్ పేయి అధ్వానిలను రామలక్ష్ణణులు గా చూస్తారు బీజేపీ శ్రేణులు.
*మొట్టమొదటి సారిగా 1996లో 10వ భారత ప్రధానిగా ప్రమాణా స్వీకారం చేసి 13 రోజులు పీఎం గా చేసారు.


*1998-99 లో రెండో సారి ప్రధానిగా చేసారు. ఈసారి 13 నెలలు ప్రభుత్వాన్ని నడిపి అవిశ్వాన్నిఎదుర్కొన్నారు.
అప్పడే 13 నెలల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాక్ తో లహోర్ చర్చలు..1999 బస్సు యాత్ర ఫిబ్రవరి లో
*కార్గిల్ యుద్ధం అనేక అంశాలు భారత చరిత్రనుతిరిగరాసాయి. జులై కాల్గిల్ యుద్ధం జరిగింది.
*దేశంలో ఇంధిరాగాంధీతరువాత లో 1999 పోక్రాన్ 2 అణు పరీక్షలు నిర్వహిచిన ప్రపంచ పటంలో భారత సత్తాను మరో సారి చాటారు.
*వాజ్ పేయికి నాట్యం , లలిత కళలు..సంగీతం , కవిత్వం అంటే చాల ఇష్టం.
*ప్రకృతి ప్రేమికుడైన వాజ్ పేయికి హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ అంటే ఇష్ణం.
*దీన్ దయాళ్ ఉపాధ్యాయ నడుపుతున్న "రాష్ట్రధర్మ" (హిందీ మాసపత్రిక),
"పాంచజన్య" (హిందీ వారపత్రిక) పత్రికలు మరియు
స్వదేశ్" మరియు "వీర్ అర్జున్" వంటి దిన పత్రికలలో పనిచేసారు.


*బ్రహ్మచారీగా ఉన్నా వాజ్ పేయి నమితా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.
*ఆర్ధిక సంస్కరణలలో బాగంగా దేశంలోకీలకమైన.. స్వర్ణ చతుర్భుజి...రోడ్లు..టెకికాం, విమానాయన రంగంలో, కీలక *నిర్ణయాలు తీసుకొని అందుబాటులోనికి తీసుకొచ్చారు.
*1991-2004 బీజేపీ జాతీయ కార్యవర్గాలు హైదరాబాద్ లో జరిగాయి వాటిలో వాజ్ పేయి పాల్గొన్నారు.
*హైదరాబాద్ నగరంలో బార్కాస్ లో మీటింగ్ పెట్టారు. నగర ముస్లింల ఆకట్టుకున్నారు.
*హైదరాబాద్ బుద్దుని విగ్రహం సందర్శించారు.


*హైదరాబాద్ లో టైగర్ నరేంద్ర, వెంకయ్యనాయడు, దత్తాత్రేయలకు చాలా దగ్గర వాజ్ పేయి
*వాల్మీకీ అంబేడ్కర్ అవాస్ యోజన పథకాన్ని హైదరాబాద్ లో ని ఎల్బీ స్టేడియంలో ప్రారంభించారు.
*2001లో వాజపేయి ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో మోకాలీ చిప్పమార్పిడి చేయించుకున్నారు.
*2005 తరువాత ముంబాయి శివాజీ పార్కులో బీజేపీ సిల్వర్ జూబ్లీ ర్యాలీ లో పాల్గొని క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
*2009లో గుండే పోటు రావడం ఆతరువాత పక్షవాతంతో మంచానికే పరిమితం అయ్యారు.
*ఉత్తమ పార్లమెంటేరేరియన్
*పద్మవిభూషన్, 2014లో భారత రత్న అవార్డు ఇచ్చారు వాజ్ పేయికి


*ఆజన్మ బ్రహ్మచారీ, దేశం కోసం సర్వస్వం త్యాగం చేసారు.
*అంజర్జాతీయంగా భారత్ ప్రతిష్ణకు ఇనుమడించిన నేత
*బంగ్లాదేశ్ విముక్రి పోరాటంలో ఇంధిరాగాంధీ ని అపర దుర్గ గా పొల్చాడు.
*పార్లమెంటులో ఆయన ప్రసంగాలు..ఎంతో ప్రసిద్ధి... రాజకీయ ప్రత్యర్దులపై వ్యంగ్య వాక్యలు చాలా సూటిగా ఉంటాయి.
*ప్రస్తుత బీజేపీలో ముఖ్య నాయకులందరూ ఆయన శిష్యులే.


*మోడీతో వాజ్ పేయికి అవినాభావ సంభందం...ప్రతి సందర్భంలో మోడీని వెన్ను తట్టి పోత్సహించే వారు
*భారత జనతాపార్టీ కార్యాలయ కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి ఇరువురి మద్య సాన్నిహిత్యం
*మోడీ ప్రతి అంశాన్ని వాజ్ పేయి దృష్టితో చూసి అనుచరిస్తారు.
*రాజ్యసభలో అప్పటి ప్రధాని డా.మన్మోహన్ సింగ్ తన ప్రసంగంలో వాజపేయిని రాజకీయ భీష్మునిగా అభివర్ణించారు.
*డిసెంబర్ 25ను సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది


*1975 నుండి 1977 ల , ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జన్సీ కాలంలో అనేకమంది విపక్ష నాయకులతో పాటు వాజ్ పేయి అరెస్టు అయినారు.
*విదేశీ వ్యవహారాల మంత్రిగా ఆయన ఐక్యరాజ్యసమితి యొక్క సర్వప్రతినిధి సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు.
*2001 లో వాజపేయి ప్రభుత్వం, ప్రాథమిక మరియు సెకండరీ విద్య యొక్క అభివృద్ధి లక్ష్యంగా సర్వశిక్షా అభియాన్ అనే ప్రసిద్ధ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
*ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన" వాజపేయి యొక్క అభిమాన ప్రాజెక్టులు.
*డిసెంబర్ 1999 కాఠ్మండు నుండి కొత్త ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం-814 ను ఆప్ఘనిస్థాన్ కు చెందిన తాలిబాన్ టెర్రరిస్టులు హైజాక్ జరింగింది
*2001 డిసెంబర్ 13 న సాయుధ ఇస్లామిక్ తీవ్రవాదులు భారత పార్లమెంటు పై దాడి చేసారు.
*అమోరాకా అధ్యక్షులు బిల్ క్లింటన్, బుష్ జూనియర్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తో వాజ్ పేయి బాగా సాన్నిహిత్యం

Related News