లైట్ వెయిట్ 'నిర్భీక్' రివాల్వర్ రూ. 1.40 లక్షబరువు తక్కువ, తుప్పు పట్టదు.హర్యానాలో 2500 రివాల్వర్లు విక్రయం ప్రపంచంలో ప్రతీ క్షణమూ ఏదో ఒక మూల మహిళలు, బాలికలపై అత్యాచారాల ఆక్రందనలు వినిపిస్తూనే ఉన్నాయి. నెలల పసిపాపనుంచి పండు ముదుసలి వరకూ మృగాళ్ల అకృత్యాలకు బలవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మహిళల కోసం పెప్పర్ స్ప్రేలు, పాకెట్ నైఫ్లకు తోడుగా తేలికైన రివాల్వర్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఏడేళ్ల క్రితం దేశాన్ని కదిలించిన ఢిల్లీ నిర్భయ ఉదంతం తరువాత మళ్లీ అలాంటి దారుణాలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో కాన్పూర్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇంటర్నేషనల్ పోలీస్ ఎక్స్‌పోలో 'నిర్భీక్' అనే తుపాకిని ప్రదర్శించింది.ఇది ప్రధానంగా మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసి చెప్పినట్టు తెలిపింది.
బలమైన, ఆత్మరక్షణ సాధనంగా ఉపయోగపడుతుందని ఫ్యాక్టరీ బోర్డు ప్రతినిధి తెలిపారు.అంతేకాదు చాలా సులువుగా దీన్ని మహిళల తమ పర్సుల్లో తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. దీని ధర ఖరీదైనప్పటికీ భారీ విక్రయాలను నమోదు చేయడం విశేషం.సాధారణ రివాల్వర్ ధర రూ. ఒక లక్ష రూపాయలతో పోలిస్తే నిర్భీక్ రూ.1.20 లక్షలకు అందుబాటులోకి తెచ్చింది. 2014లో 750 గ్రాములతో లాంచ్ చేసిన దీని బరువులో మరిన్ని మార్పులు చేసి ప్రస్తుతం 500 గ్రాములకు తీసుకొచ్చింది. అయితే తాజాగా జీఎస్టీ పెరగడంతో రూ. 1.40 లక్షల ధరతో నిర్బీక్ను తాజాగా విడుదల చేశారు. టైటానియం అల్లాయ్ మెటల్‌తో తయారు చేసిన ఈ నిర్భీక్ తుపాకీ తుప్పు పట్టదు, మెయింటెనెన్స్ కూడా చాలా సులభం.