//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిజెపికి పిచ్చెక్కించిన వారి వ్యూహం

Category : national politics

ఇప్పటి వరకు మోడీ మళ్ళి ప్రధాని అన్న వారు గురువారం నాటి ఉప ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఊహించిని ఫలితాలు ఇచ్చిన ఈ ఉప ఎన్నికలు బిజెపికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. విపక్షాలు అన్ని కలిస్తే బిజెపికి ఓటమి తప్పదు అనే సంకేతాలు ఇచ్చిన ఈ ఎన్నికలు మోడిషాలకు ఇప్పటి వరకు మద్దతు ఇచ్చిన వారికి చుక్కలు చూపించాయి. ముఖ్యంగా మే 28న జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కువ మంది దృష్టిని ఆకట్టుకున్న నియోజకవర్గం- పశ్చిమ యూపీలోని కైరానా.

గురువారం వెల్లడైన ఫలితాల్లో అక్కడి నుంచి రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) అభ్యర్థి తబస్సుమ్‌ హసన్‌ 44,600 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారంటే దాని వెనుక విపక్షాల ఉమ్మడి వ్యూహం ఉంది. ఇక్కడ భాజపా వ్యతిరేక పార్టీలన్నీ తమ సిద్ధాంతాలను, బలాబలాలను పక్కనపెట్టి ఒక్కతాటిపైకి వచ్చాయి. ‘మతతత్వ భాజపా అభ్యర్థి’ని ప్రత్యర్థిగా చూపిస్తూ మిగిలిన పక్షాలన్నీ చేతులు కలిపాయి. ఆర్‌ఎల్‌డీ గుర్తుపై, బీఎస్పీ-కాంగ్రెస్‌ల మద్దతుతో తబస్సుమ్‌ బరిలో దిగారు. ఒక్కసారి అక్కడి విపక్షాల ఉమ్మడి వ్యూహం చూస్తే

* సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్‌ గానీ, ఆ పార్టీలో ముస్లిం ప్రముఖుడైన ఆజంఖాన్‌ గానీ కైరానాకు ఒక్కసారీ రాలేదు. 2013లో చోటు చేసుకున్న ముజఫర్‌నగర్‌ అల్లర్ల తర్వాత జాట్లు, ముస్లింలలో ఎస్పీ పై ఆగ్రహం ఉందనే భావన దానికి కారణం.

* జాట్ల బలం ఉన్న ప్రాంతాల్లో తబస్సుమ్‌ ఒక్కసారైనా ప్రచారం చేయలేదు. జాట్లు, ముస్లింలు ఎస్పీపై కోపంతో ఉన్నారనే ఉద్దేశంతో... అఖిలేశ్‌ సూచన మేరకు తబస్సుమ్‌ ఎస్పీని వీడి ఆర్‌ఎల్‌డీ టికెట్‌పై పోటీ చేశారు. ముస్లింలపై ఆమె సానుకూల ప్రభావం చూపించారు.

* కైరానాలో విపక్ష శిబిరం తమ అభ్యర్థి పేరునైనా ప్రచారం చేయలేదు. కేవలం ఆర్‌ఎల్‌డీ చిహ్నమైన చేతిపంపును మాత్రం ప్రచారంలో వాడుకున్నారు. గోడపత్రికల్లోనూ అభ్యర్థి చిత్రం లేకుండా జాగ్రత్త పడ్డారు.

* ఆర్‌ఎల్‌డీ అగ్రనేత అజిత్‌సింగ్‌, ఆయన తనయుడు జయంత్‌ చౌదరి ఒక్కసారైనా ముస్లింల ప్రాబల్య ప్రాంతంలో ఓట్లు అడగలే దు. భాజపాకి పూంఛ్‌ (తోక) అయ్యే బదులు, ఆర్‌ఎల్‌డీకి మూంఛ్‌ (మీసం)గా ఉండడం మంచిదంటూ అజిత్‌సింగ్‌ నినదించారు.

* బీఎస్పీ కార్యకర్తలు దళితుల ప్రాబల్య ప్రాంతాల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు. బీఎస్పీ మద్దతు ఉన్న అభ్యర్థి ఆర్‌ఎల్‌డీ టికెట్‌పై పోటీ చేస్తున్నారని ఎక్కడా చెప్పలేదు. దీనికి కారణం... ఆర్‌ఎల్‌డీని దళిత వ్యతిరేకిగా భావిస్తుండడమే. అభ్యర్థి ముస్లిం అని మాత్రమే బీఎస్పీ చెబుతూ వచ్చింది. పెద్ద శ్రమ లేకుండా దళిత ఓట్లు తబస్సుమ్‌కు లభించాయి.

* గోరఖ్‌పూర్‌, ఫూల్‌పూర్‌ ఉప ఎన్నికల్లో ధరావతుల్ని కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ ఈసారి తమ సొంత అభ్యర్థిని కైరానాలో నిలబెట్టకూడదని నిర్ణయించింది.