సౌత్ ఆఫ్రికా లో వన్డే సిరీస్ గెలవాలి అన్న భారతీయుడి కోరిక ఇంతవరకూ తీరానేలేదు.ఇప్పుడు ఆ కోరిక తీరే ఛాన్స్ ఉంది.ఇప్పటికే ఇండియా మూడు వన్డే ల్లో గెలిచింది.మరో మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ మన సొంతం అవుతుంది.
పోర్ట్ ఎలిజబెత్ వేదికగా కాసేపట్లో భారత్, దక్షిణాఫ్రికా ఐదో వన్డే ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరు వన్డేల సిరీస్ లో ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచుల్లో టీమిండియా మూడింట్లో గెలిచి ఒక దాంట్లో ఓడిన విషయం తెలిసిందే.
ఈ రోజు భారత్ మ్యాచ్ గెలిస్తే ఈ సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. ఈ రోజు జరిగే మ్యాచ్కి వరుణుడు అడ్డుతగులుతాడని భావించినప్పటికీ వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఆటమొదలైంది. ఇప్పటికే మూడు మ్యాచులు ఓడిన దక్షిణాఫ్రికా ఈ వన్డేలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కసిగా ఉంది.ఈ మ్యాచ్ ఇరు దేశాలకు కీలకం కానుంది.