//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Shobana Movies : శోభన సినిమాలు : South Actress sobhana photos family images videos marriage

Category : editorial

శోభన ప్రఖ్యాతిగాంచిన భారతీయ సినీ నటి. ఈమె మార్చి 21, 1966 లో జన్మించింది.నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలు శోభన.

శోభన నాగార్జున నటించిన తోలి చిత్రం విక్రమ్ తో తెలుగు తెర కు పరిచయమయ్యారు.రంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్‌తో, మోహన్ బాబుతో అల్లుడుగారు, రౌడీగారు, మొదలగు సినిమాలల్లో నటించింది.

తెలుగుతోపాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. చంద్రముఖి (రజనీకాంత్) చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణిచిత్రతాజులో అద్భుతంగా నటించి అవార్డు పొందింది.ఈమె హీరోయిన్ గా మాత్రమే గాక కొన్ని సినిమాలల్లో ప్రత్యేక పాటలలో నటించింది.

చెన్నై లోని చిదంబరం నాట్య అకాడెమీలో శిక్షణ పొందినది. ఆమె గురువు పేరు చిత్రా విశ్వేశ్వరన్ . భరత నాట్యంలో ఎంతో ముఖ్యమైన అభినయాన్ని ప్రదర్శించడంలో ఆమె దిట్ట. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఈమె దగ్గర నటనలోను, నాట్యంలోను శిక్షణ తీసుకుంటున్నారు.

1994లో ఆమె కళార్పణ అనే సంస్థకు అంకురార్పణ చేసింది. ఈ సంస్థ యొక్క ముఖ్యోద్దేశం భరతనాట్యంలో శిక్షణ, భారతదేశమంతటా నృత్యవార్షికోత్సవాలు నిర్వహించడం.

1994లో విడుదలైన మణిచిత్రతళు అనే మలయాళ సినిమాకు గాను ఆమెకు భారత ప్రభుత్వం నుంచి తొలిసారిగా జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. తరువాత 2001 వ సంవత్సరంలో ప్రముఖ దక్షిణాది నటి రేవతి దర్శకత్వం వహించిన మిత్ర్ మై ఫ్రెండ్ అనే ఆంగ్ల చిత్రానికి గాను రెండవసారి జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది.

Related News