//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Rambha Movies : రంభ సినిమాలు : South Actress ramba photos family images videos marriage husband galleries caste bio data

Category : editorial

రంభ తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటి. ఈమె స్వస్థలం విజయవాడ. ఈమె జూన్ 5, 1976 లో జన్మించింది. ఈమె మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్ళి చేసుకునింది. వీరికి ఒక కుమార్తె వున్నది.

ప్రముఖ దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ తెలుగు తెరకు ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వార పరిచయం చేసాడు.ఆమె మొత్తంగా వంద సినిమా లల్లోనటించింది.తెలుగు లో అగ్ర హీరో లతో నటించింది.తెలుగు లో కొన్ని సినిమా లల్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా చేసింది.

చిరంజీవి గురించి రంభ చెప్పిన విషయాలు;

నాకు చిరంజీవి గారంటే మొదట్నించీ చాలా ఇష్టం. చదువుకునే రోజుల్నుంచీ ఆయన అభిమానిని. అలాంటిది ‘హిట్లర్‌’ సినిమాలో ఆయన పక్కన హీరోయిన్‌గా చేయడం అనేది నేను కలలో కూడా ఊహించని అదృష్టం. మొదటిరోజు సంతోషంతో ఏం మాట్లాడాలో తెలియలేదు.

ఆయన్ని చూస్తూ అలా ఉండిపోయాను యూనిట్‌ వాళ్ళు వచ్చి నా గురించి చిరంజీవి గారితో చెప్పారు. మీరంటే తనకి చాలా అభిమానం. ఎప్పుడూ మీ గురించే మాట్లాడుతూ ఉంటుంది అని. దాంతో చిరంజీవిగారే వచ్చి ఆప్యాయంగా పలకరించారు. సినిమా షూటింగ్‌ అయేపోయేంత వరకూ నన్ను అభిమానంగానే చూసేవారు. ప్రేమగా మాట్లాడేవారు. అప్పటికే ఆయన సూపర్‌ స్టార్‌. అలాంటి ఆయన తనకన్నా జూనియర్‌తో ప్రేమగా మాట్లాడారంటే అదంతా ఆయన గొప్పతనమే.

రంభ గురించి, నటన గురించి, ఆమె అందం గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటి వరకు వెండితెరపై తన అందాలతో ప్రేక్షకలను మెప్పించిన రంభ ప్రస్తుతం మళ్లీ రీ ఎంట్రీతో పాటు, నిర్మాతగా మారి కొన్ని చిన్న చిన్న సినిమాలని కూడా నిర్మించాలనుకుంటుందట. అయితే నిర్మాతగా మారడం మాత్రం ఏ మాత్రం సేఫ్ కాదంటున్నారు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు.

రంభ గతంలో కూడా ఓ సారి నిర్మాతగా మారి చేతులు కాల్చుకుంది. మళ్ళీ ఇప్పుడు సినిమాలు నిర్మించాలనే ఆలోచన రంభకి ఎందుకొచ్చిందోగానీ మళ్లీ నిర్మాతగా మారలనుకుంటుంది. మంచిది కాదని సన్నిహితులు ఎంత వారించినా కానీ రంభ మాత్రం తాను లో బడ్జెట్‌ సినిమాల గురించే ఆలోచిస్తున్నాను కాబట్టి, తాను చేయబోయే పని రిస్క్‌తో కూడుకున్నది కాదంటోంది.