//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Meena Movies : మీనా సినిమాలు : South Actress Meena photos family images videos love marriage husband children galleries caste bio data

Category : editorial

మీనా దక్షిణ భారత సినిమా నటి. అప్పటి మద్రాసు నగరంలో పుట్టి పెరిగిన మీనా తెలుగు, తమిళ మరియు మలయాళం సినిమా రంగములలో పేరుతెచ్చుకొన్నది. 1975, సెప్టెంబర్ 16 న మద్రాసులో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు. ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి.

మీనా తెలుగు మరియు తమిళ చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసింది. బాలనటిగా రజినీకాంత్ మరియు కమలహాసన్ తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది.

ఈమె నటించిన తమిళ సినిమాల్లో ముత్తు, యజమాన్, వీరా మరియు అవ్వై షణ్ముగి మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్ తో నటించిన సినిమాలు జపాన్లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడము చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమానవర్గము ఉంది.

మీనా దాదాపు అన్ని దక్షిణ భారత భాషా సినిమాల్లో నటించింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసింది.

తెలుగులో వెంకటేష్, మీనా జంటగా సుందర కాండ, చంటి, సూర్య వంశం, అబ్బాయిగారు వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి.ఇలా తెలుగు మరియు తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలచింది.

మీనా పెళ్ళి తర్వాత సినిమాలకు కాస్త దూరమైంది. ఇటీవల దృశ్యం చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన మీనా సెకండ్‌ ఇన్నింగ్స్ లో సత్తా చూపేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఇన్నాళ్ళు నటిగా ఉన్న మీనా నిర్మాతగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటుంది. ఈ నేపధ్యంలో మహేష్‌, కమల్‌ హాసన్ లాంటి స్టార్‌ హీరోలతో సినిమాలు చేయాలని భావిస్తుంది.

Related News