//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Jyothika Movies : జ్యోతిక సినిమాలు : South Actress Jyotika photos family images videos love marriage husband children galleries caste bio data

Category : editorial

జ్యోతిక దక్షిణ భారత దేశానికి చెందిన ప్రముఖ నటి.జ్యోతిక 1978 అక్టోబరు 18 న ముంబైలో చందర్ సదానా, సీమా సదానా దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి సినీ నిర్మాత. వాళ్ళది పంజాబీ కుటుంబం. ఆమె సోదరి నగ్మా కూడా చాలా సినిమాల్లో కథానాయికగా నటించింది. నగ్మా జ్యోతిక తల్లి మొదటి భర్త సంతానం.

2006 సెప్టెంబరు 11 న సినీ నటుడు సూర్యను వివాహమాడింది.తెలుగు లో ఆమె చేసిన సినిమాలు అన్ని దాదాపుగా హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.ఆమె తమిళం లో తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి చేసిన చంద్రముఖి భారీ విజయాన్ని నమోదు చేసింది.

ఈ సినిమా లో ఆమె చేసిన పాత్రకు విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చాయి.జ్యోతిక పెళ్లి తరువాత కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు.తరువాత మళ్ళీ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.

36 వ‌యోనిదిలే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన జ్యోతిక ప్ర‌స్తుతం సెలక్టెడ్ స‌బ్జెక్ట్స్‌ని ఎంచుకుంటూ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తుంది. జ్యోతిక తాజా చిత్రం మగళీర్‌ మట్టుం ఫీమేల్ సెంట్రిక్ మూవీగా తెర‌కెక్కగా, ఈ చిత్రంలో జ్యోతిక డాంక్యుమెంటరీ ఫిలింమేక‌ర్ గా కనిపించ‌నుంది. నాజ‌ర్, లివింగ్‌స్ట‌న్‌, ఊర్వ‌శి, శ‌ర‌ణ్య‌, పోన్వ‌న్న‌న్, అంబులి గోకుల్ నాథ్‌లు ఈ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించారు.

2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై సూర్య ఈ చిత్రం న్నీ నిర్మించాడు. ఈ క్ర‌మంలో జ్యోతికి త‌న సినిమాకి భారీ ప్ర‌మోష‌న్స్ చేసుకుంటుంది. ఇందులో భాగంగా ఓ ఛానెల్‌కి ఇంట‌ర్వ్యూ ఇస్తూ మ‌గ‌ళీర్ మ‌ట్రుం చిత్రం రోడ్ నేప‌ధ్యంలో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంద‌ని పేర్కొంది. ఇక సినిమా ప‌రిశ్ర‌మ గురించి మాట్లాడుతూ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో పురుషాధిక్య‌త అధికం.

హీరోల సినిమాలు ఎంత చెత్త‌గా ఉన్న‌ప్ప‌టికి నాలుగైదు రోజులు ఆడుతుంది. అదే లేడి ఓరియెంటెడ్ సినిమా ఎంత మంచి క‌థ‌తో రూపొందిన‌ప్ప‌టికి వారం త‌ర్వాత వ‌సూళ్ళు రావ‌డం మొద‌లవుతాయి. మ‌హిళ‌ల‌కి ఈ రంగంలో ప్రాముఖ్య‌త చాలా త‌క్కువ‌. ఈ ప‌రిస్థితులు మారాలి. హీరో మాధ‌వ‌న్ సుధా కొంగ‌ర లాంటి ద‌ర్శ‌కురాలికి అవ‌కాశం ఇవ్వ‌క‌పోయి ఉండి ఉంటూ ఇరుదుసుట్రు వంటి భారీ హిట్ చిత్రం వ‌చ్చి ఉండేదా అంటూ కొన్ని సంచ‌న‌ల‌న కామెంట్స్ చేసింది. జ్యోతిక చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం త‌మిళ‌నాట హాట్ టాపిక్ గా మారాయి.