ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ సోని భారత మార్కెట్లోకి ఎక్స్‌పీరియా ఎక్స్జెడ్ను విడుదల చేసింది.ఈ ఫోన్ బాడీని అల్యూమినియం, గ్లాస్‌లతో తయారు చేశారు. వాటర్, డస్ట్ రెసిస్టెంట్ లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఎక్స్‌పీరియా శ్రేణికి చెందిన ఫోన్ల ఫీచర్లు పేపర్ మీద బాగున్నా.. దుమ్ముతో పాటు నీటిలో పడిన ఈ ఫోన్ పనిచేయడమే దీని ప్రత్యేకతలని ఆ కంపెనీ పేర్కొంది. మిగతా ఫీచర్లు ఇలా ఉన్నాయి.
క్వాల్కామ్ స్పాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 4జిబి ర్యామ్‌తో పాటు 64 జిబి మెమోరీని 256 జిబికి విస్తరించుకోవచ్చు. అలాగే 19 ఎంపి వెనుక కెమేరా, 13 ఎంపి ముందు కెమేరా, హైబ్రిడ్ సిమ్ స్లాట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 4జి, వోల్ట్, అండ్రాయిడ్ 7.1తో పాటు 2900 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఐస్బ్ల్యూ, బ్లాక్, వామ్ సిల్వర్ వంటి మూడు రంగుల్లో ఈ కొత్త ఎక్స్పిరియో ఎక్స్జేడ్స్ లభించనున్నట్టు తెలిపింది.
ఏప్రిల్ 4 నుంచి 10 వరకు ముందస్తు బుకింగ్‌లకు సోని స్టోర్లతో పాటు ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. దీనికితోడు ముందస్తు బుకింగ్ ద్వారా కొనుగోలు చేసిన వారికి ఉచితంగా ఎస్ఆర్ఎస్-ఎక్స్‌బి10 వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్ అందించనున్నట్టు పేర్కొంది. దీని ధర రూ.49,900గా నిర్ణయించింది.