బాడ్మింటన్ క్రీడాకారిణి సింధు బయోపిక్ నిర్మించే పనిలో భాగంగా సోనూసూద్ సింధు తో కలసి కొంతసేపు సరదాగా గోపీచంద్ అకాడమీ లో బాడ్మింటన్ ప్రాక్టీస్ చేసారు. తాను చాల కాలం తరవాత బాడ్మింటన్ ఆడుతున్నానని వరల్డ్ స్థాయి క్రీడాకారిణి తో ఆడటం ఎక్సిటింగ్ గా ఉన్నదని సోనూసూద్ పేర్కొన్నారు.
మొట్టమొదట నెమ్మదిగా ఆడిన సింధు తాను బాగా ఆడటం గమనించిన తరువాత తాను కూడా తన ఆటను పెంచింది అని తనతో ఓడిపోవటం అనే భయం తనకు కలగలేదని సోనూసూద్ పేర్కొన్నారు. ఒక కన్నడ సినిమా లో నటించేందుకు తానూ హైదరాబాద్ వచ్చానని, టాలీవుడ్ అంటే తనకి ప్రత్యేకమయిన ప్రేమ ఉందని ఈ సందర్భంగా సోను సూద్ పేర్కొన్నారు