//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాహుల్ గాంధీ ప్రధాని కాకపోయినా సరే.. బీజేపీ మాత్రం అధికారంలోకి రాకుడదన్నదే.... సోనియా ప్లాన్.

Category : national politics

దేశ రాజకీయాలలో ఎన్నికల సంగ్రామమ్ మొదలైనప్పటి నుంచి ప్రధాన జాతీయ పార్టీలు అయిన బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు ఈ సారి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తప్పకుండా తామే అధికారం లోకి వస్తమంటు ఎవరికి వారు తమ ధీమా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ నేపధ్యంలోనే లోక్ సభ ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో మెజార్టీ రాదనే భావనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ...తమకు మద్దతు ఇచ్చే ప్రాంతీయ పార్టీల మద్దతు కూడ గట్టుకుని పని లో పడ్డాయి. ఇందు కోసం ఇప్పటి నుంచే అధికార వ్యూహరచన మొదలుపెట్టింది. తమకు ఎన్ని సీట్లు వస్తాయనే విషయంపై...... ఓ అంచనాకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ... ప్రాంతీయ పార్టీలను తమ వైపు తిప్పుకోగలిగితే కేంద్రంలో మళ్లీ అధికారం దక్కించుకోవచ్చనే ఆలోచనలో ఉంది.అయితే గతంలో మాదిరి గానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే ఆయా పార్టీలు ప్రధాని పదవి వదులుకోవడానికి మాత్రం సిద్దంగా లేవని అర్థం అవుతుంది.

ఒక వేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా.ప్రధాని పదవి మాత్రం తమకే కావాలని భావిస్తున్నారు .ఇలా కోరుకునే ప్రాంతీయ పార్టీల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇందులో ప్రధానంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రధాని పదవిపై కన్నేసినట్టు అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ మద్దతు తీసుకోవడానికి తాము సిద్ధమే అనే భావనలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ సైతం ... ప్రధాని పదవి మాత్రం మిత్రపక్షాలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రధాని పదవిని సైతం వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మానసికంగా సిద్ధపడుతున్నట్టు సమాచారం. ఇది ఎంత మేరకు నిజమవుతుంది అనేది మాత్రం కొంత కాలం వేచి చూడక తప్పదు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ నాయకుడు గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి.

తమకు ప్రధాని పదవి దక్కకపోతే మరొకరికి ఆ పదవి రాకుండా అడ్డుకోబోమని పరోక్షంగా మిత్రపక్షాల్లో ఒకరు ప్రధాని అయినా పర్వాలేదు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి ప్రతిపాదనకు కూడా కాంగ్రెస్ సముఖంగానే ఉన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.అయితే కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా మిత్రపక్షాలకు ప్రధాని పదవిని వదులుకుంటుందా అన్నది ఇప్పుడే చెప్పలేం. ప్రాంతీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే... చివరకు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే ప్రధాని అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నది ఆ పార్టీ బలమైన నమ్మకం. ఏదేమైనా... ముందు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగితే... ఆ తరువాత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడంపై దృష్టి పెట్టొచ్చని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటుంది.చూడాలి మరి ఈ సారి అయినా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో చక్రం తిప్పుతుందా లేదా అన్నది.