//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అర్థ‌రాత్రి లుంగీ క‌ట్టుకొచ్చాడు.. పెద్ద మ‌గాడిలా..!

Category : movies

మేనేజ‌ర్ చేత మేము.. పి..కించుకోవాల్నా..? మేనేజ‌ర్ ఏం చెబితే అది చేయాల్నా..? క‌థ ఎవ‌రు చెబుతారండీ..? క‌థ చెబితే ఏ డైరెక్ట‌రో.. ప్రొడ్యూస‌రో చెప్పాలి. అంతేకానీ, మ‌ధ్య‌లో ఈ మేనేజ‌ర్లు ఎవ‌రండీ..? అటువంటి మేనేజ‌ర్ల వ‌ల్లే సినీ ఇండ‌స్ట్రీకి చెడ్డ పేరు వ‌స్తుందంటూ థార్డ్ జెండ‌ర్ న‌టి సోనా రాథోడ్ అన్నారు. క‌ళామ‌త‌ల్లి నా క‌డుపు నింపేందుకు పెట్టిన భోజ‌నాన్ని మ‌ధ్య‌లో మ‌ధ్య‌వ‌ర్తుల‌గా ఉన్న మేనేజ‌ర్లు తినేశారు. వారి వ‌ల్లే నేను ఇవాళ మీడియా ముందుకు రావాల్సి వ‌చ్చిందంటూ సోనా రాథోడ్ అన్నారు.

అయితే, ఆదివారం ఓ సోష‌ల్ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సోనా రాథోడ్ మాట్లాడుతూ.. సినిమా అవ‌కాశాలు ఇచ్చే ముందుగా ఒక బోర్డు పెట్టాల‌ని. ఆ బోర్డులో స్క‌ర్టులు వేసుకుర‌మ్మనో లేక చీర క‌ట్టుకు ర‌మ్మ‌నో, మ‌రేదో డ్ర‌స్ వేసుకు ర‌మ్మ‌నో చెప్పాలే త‌ప్ప... గెస్ట్ హౌస్‌కు పిలిచి చెక్ చేయ‌డం మంచి ప‌ద్ధ‌తి కాద‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలోనే మ‌రుపురాని స‌న్నివేశాల డైరెక్ట‌ర్ అర్థ‌రాత్రి 12 గంట‌ల సమ‌యంలో లుంగి క‌ట్టుకుని తాను ఉంటున్న రూముకు వ‌చ్చాడ‌ని, త‌లుపు ట‌కా ట‌కా త‌ట్టి మ‌రీ త‌న‌ను నిద్ర లేపాడ‌ని చెప్పారు. నీకు అవ‌కాశం ఇచ్చా క‌దా.. మ‌రి నాకేంటి అని అడిగాడ‌ని సోనా రాథోడ్ చెప్పారు. అయితే, ఆ డైరెక్ట‌ర్‌ను ప్ర‌తిఘ‌టించ‌డంతో అక్క‌డ్నుంచి వెళ్లిపోయాడ‌ని, ఇక అప్ప‌ట్నుంచి మంచి మంచి క్యారెక్ట‌ర్ల‌నే ఎంచుకుంటున్నాన‌ని తెలిపారు.