//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీలో ప‌నీ పాటా లేని నెంబ‌ర్ వ‌న్ లీడ‌ర్..!

Category : politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్ జనాలు అంటే పడదో ఏమో గానీ సోము వీర్రాజు కి ఇరవై నాలుగు గంటలూ ఏపీ మీదా చంద్రబాబు మీదా ముఖ్యంగా టీడీపీ మీద ఏడుపు చాలా ఇంపార్టెంట్‌గా అనిపిస్తుంది. ఎక్కడ ఏ సందు దొరికినా సందు దొరక్కపోతే సందులో దూరి అయినా సరే చంద్రబాబు, టీడీపీని టార్గెట్‌ చెయ్యడంలో ముందే ఉంటారు ఆయన.

ఆంధ్ర ప్రదేశ్ కి ఇచ్చిన హామీలకి సంబంధించి కేంద్రం చిత్త శుద్ధి గురించి మాట్లాడుతూ తాజాగా ఏలూరులో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఆంధ్ర ప్రదేశ్ కి ఇప్పటికే కేంద్రం ఇచ్చిన హామీలలో తొంభై శాతం పూర్తి చేసిందట .

టీడీపీ మాత్రం ఇచ్చిన హామీలలో పది శాతం కూడా పూర్తి చెయ్యలేదు అంటూ కొత్త లాజిక్ పట్టుకొచ్చారు సోము. నిరుద్యోగ భృతి ఇంకా ఇవ్వలేదని విమర్శించారు. చంద్రన్న బీమా పథకం, గ్రామాల అభివృద్ధి కేంద్రం నిధులతోనే నడుస్తోందన్నారు. ఈ విషయం మీద బహిరంగ సిద్ధమా అంటూ టీడీపీ కి సవాల్ కూడా విసిరారు సోము. అయితే సోము వీర్రాజు జనాలకి చేసేది కానీ , కనీసం తన సొంత పార్టీ బీజేపీకి చేసేది కానీ ఎప్పుడూ కనపడలేదు.

ఆయన ఎప్పుడు చూసినా పనీ పాటా లేకుండా తిరుగుతూనే కనిపిస్తారు. నిరంతరం టీడీపీ మీద విషం కక్కడం తప్ప కనీసం బీజేపీ కి ఏపీలో ఈ నాలుగేళ్ల వ్యవధి లో ఒక్కటంటే ఒక్క నియోజికవర్గం లో కూడా బలం పుంజుకునేలా చెయ్యలేకపోయారు ఆయన గారు.

ఇంకా చెప్పాలంటే సొంత జిల్లా తూర్పుగోదావ‌రిలో కాకినాడ కార్పొరేష‌న్‌కు ఎన్నిక‌లు జ‌రిగితే 9 సీట్లు ఇస్తే 3 సీట్లు గెలిపించుకున్న ఆయ‌న జిల్లా పార్టీ అధ్య‌క్షుడిని కూడా గెలిపించుకోలేని ఘన‌మైన రికార్డు సొంతం చేసుకున్నారు.

ఇక చంద్ర‌బాబు ద‌య‌తో ఎమ్మెల్సీ అయిన వీర్రాజు ఇప్పుడు అదే చంద్ర‌బాబును విమ‌ర్శిస్తూ ప‌బ్బం గ‌డుపుకుంటున్నాడు. ఇక ఆయ‌న వ‌ల్ల ఏపీలో ఒక్క వ్య‌క్తికి అయినా కొంచెం ఉప‌యోగం కూడా లేదు. ఆంధ్రా లో పనీ పాటా లేని లీడర్ అంటే ఆయన పేరే ముందర వినిపిస్తుంది. వీర్రాజు ప‌దే ప‌దే టీడీపి తిట్ట‌డం త‌ప్ప వేరే ప‌నిలేదా అంటూ జనమే విసిగిపోయి ఆయన మీద చిరాకు పడుతున్నారు .