//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాబు దుమ్ముదులిపిన సోము

Category : state world

అవకాశం దొరికితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒంటికాలుతో లేస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు… మరోసారి ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు… ఏపీ అభివృద్ధే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు… బీజేపీ నేతలను కాదు చంద్రబాబును నిలదీయండన్న వీర్రాజు… ధర్మాన్ని కాపాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. హోదా అంటే జైలుకే అని స్వయంగా చంద్రబాబే చెప్పారని.. ఇప్పుడు ఎవరు జైలుకు వెళ్లాలో చెప్పాలని ప్రశ్నించిన బీజేపీ ఎమ్మెల్సీ… హోదాతో ఒరిగేదేమీలేదని చంద్రబాబు అన్నారన్నారని గుర్తు చేశారు.

రాష్ట్రనికి ప్రత్యేక హోదాకంటే ప్యాకేజీతోనే ఎక్కువ న్యాయం జరుగుతోందని అప్పట్లో ప్రకటించిన చంద్రబాబు ఇపుడు కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. నాడు సీఎం చంద్రబాబు చెప్పినవే నేను ఇన్ని రోజులు చెబుతూ వస్తున్నానన్నారు సోము వీర్రాజు… అప్పటి ఎంపీలు ఏం చేశారని ప్రశ్నించిన ఆయన… బీజేపీ వల్లే ముంపు మండలాలను ఏపీలో కలిపారని గుర్తు చేశారు.

పోలవరం టార్గెట్ 2019 వరకే అంటూ బీజేపీని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించిన ఆయన… ఇంకా సమయం ఉంది కదా అన్నారు. ఏపీకి ఏం కావాలో అడగకుండా పార్లమెంట్‌లో సీఎం రమేష్‌, సుజనా చౌదరి సమన్యాయం కావాలన్నారని మండిపడ్డారు. విభజన బిల్లు పార్లమెంటులో ఉండగా.. కాంగ్రెస్‌, టీడీపీ ఎంపీలు నాడు కనీసం ప్రత్యేకహోదా డిమాండ్‌ పై యూపీఏ ప్రభుత్వాన్ని నిలదీయలేదన్నారు.

నాడు నోరుమూసుకుని విభజనకు అంగీకరించిన నేతలు.. ఇపుడు రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారని సోము వీర్రాజు విమర్శించారు.