//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విషమించిన లోక్‌సభ మాజీ స్పీకర్ ఆరోగ్యం......!

Category : politics

విషమించిన లోక్‌సభ మాజీ స్పీకర్ ఆరోగ్యం......!

లోక్‌సభ మాజీ స్పీకర్, సీపీఎం సీనియర్ నేత సోమ్‌నాథ్ ఛటర్జీ ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. శరీరంలోని కీలక అవయాలు వైద్యానికి సహకరించడం లేదని, పరిస్థితి తీవ్రంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఈనెల 10న సోమ్‌నాథ్ ఛటర్జీ కిడ్నీ, శ్వాససంబంధిత సమస్యలతో ఇక్కడి ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కాగా, 89 ఏళ్ల ఛటర్జీ గత జూన్‌లో స్ట్రోక్ రాకవడంతో కోల్‌కలతాలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా కుదుటపడటంతో కొద్ది రోజుల క్రితమే ఆయనను డిశ్చార్చి చేశారు.

అయితే తిరిగి ఆయన తాజాగా శ్వాససంబంధిత సమస్యలు ఎదుర్కోవడంతో మళ్లీ అదే ఆసుపత్రిలో చేర్చారు. ఛటర్జీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు తెలియగానే పలువురు వామపక్ష నేతలు ఆసుపత్రిని సందర్శించారు.

Related News