సోమాలియాలో ఘోరం జరిగింది. ఉగ్రవాది అనుకుని ఒక మంత్రిని భద్రతా దళాలు చంపేశారు. ఉగ్రవాదంతో మగ్గిపోతున్న సోమాలియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్ ఖైదా తీవ్రవాదులు తరచు దాడులు చేస్తున్నారు. వాటిని నివారించేందుకు సెక్యూరిటీ దళాలు ప్రతిదాడులు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో మంత్రి సిరాజ్ అబ్బాస్ రాజదాని నగరం మఘదీషు లో కారులో వెళుతుండగా అనుమానంతో సెక్యూరిటీ దళాలు పొరపాటున మంత్రిపై కాల్పులు జరిపారు. దాంతో ఆయన అక్కడికక్కడే మరణించాడని సమాచారం.