//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రమ్మన్న షా...పొమ్మన్న బాబు !

Category : politics

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేశారని సమాచారం. ఢిల్లీకి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చని సూచించారని అయితే దీనికి చంద్రబాబు ససేమిరా అన్నారని తెలుగుదేశం వర్గాల సమాచారం. తాను రాను కానీ అవసరమైతే ముగ్గురు సభ్యుల బృందాన్ని మీవద్దకు పంపిస్తామని చెప్పారని తెలుస్తోంది. దీంతో షా ఫోన్ పెట్టేసినట్టు సమాచారం.

సోమవారం నుంచి బడ్జెట్ మలిదశ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీకి సాయం అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసిన పక్షంలో రాజీనామాలకు సిద్ధమని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు. దీంతో ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ కూడా దూరమవుతుందని బీజేపీ భావిస్తోంది.

ఈనేపథ్యంలో చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేసి, చర్చిద్దాం రమ్మని ఆహ్వానం పలికారని తెలుస్తోంది. ఐదో తేదీన ఢిల్లీకి వస్తే కలిసి మాట్లాడుకుందామని సూచించారని, అయితే చర్చలకు తాను రానని స్పష్టంగా తేల్చిచెప్పారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావులను పంపిస్తానని, వారితో మాట్లాడాలని ఆయన తెలిపారు. దీంతో షా ఖంగుతిని ఫోన్ పెట్టేశారని సమాచారం

Related News