//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అయోధ్య వివాదానికి సమీపంలో పరిష్కారం ?

Category : national

ఏడు దశాబ్దాలుగా వివాదాస్పదంగా మారిన అయోధ్య అంశంపై తొందరలో పరిష్కారం కుదిరే అవకాశం  కనిపిస్తున్నది. ప్రస్తుతం సుప్రీం కోర్ట్ పరిశీలనలో ఉన్న ఈ అంశంలో తమను కూడా పార్టీగా చేర్చుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన ఉత్తర ప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు "ముస్లింల ఆధిపత్యం ఉన్న వివాదాస్పద స్తమాలో మసీజ్ నిర్మాణానికి మేము సిద్ధంగా ఉన్నాము" అంటూ  తెలిపింది.

ఈ బోర్డు సభ్యుల కధనం మేరకు బాబ్రీ మసీద్ గా పేరొందిన వక్ఫ్ మసీద్ మీర్ బాకీ బాబర్ హయాంలో మీర్ బాకీ నిమించిన షియా మసీద్. మీర్ బాకీ పర్షియా నుండి వచ్చిన షియా ముస్లిం. "ఇదెప్పుడు షియా మసీద్... మసీద్ లోని ఇమాం, మ్యూస్జిన్ లు మాత్రమే సున్నీలు. వారికి షియా మూటవ్వాలి జీతభత్యాలు చెల్లిస్తుండేవారు. షియా, సున్నీలు - ఇద్దరు నమాజ్ చేసుండేవారు" అని బోర్డు చైర్మన్ వసీమ్ రాజవి స్పష్టం చేశారు.

1944లో సున్ని బోర్డు తమ పేరుతో ఈ మసీద్ ను నమోదు చేయడంతో షియా బోర్డు 1945లో కోర్ట్ లో సవాల్ చేసింది. సున్నితమైన, సెంటిమెంట్ లకు సంబంధించిన అయోధ్య అంశాన్ని సామరస్యంగా, ఏకాభిప్రాయం ద్వారా పరిష్కరించాలని ఇదివరకు సుప్రీం కోర్ట్ స్పష్టం చేయడం తెలిసిందే. అవసరమైతే ప్రధాన మధ్యవర్తిని కోర్ట్ ఎంపిక చేస్తుందని కూడా కోర్ట్ సూచించింది. ఇరు పక్షాలు తనను మధ్యవర్తిత్వం వహించమని కోరితే తాను అందుకు సిద్ధమని కూడా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె యస్ ఖేహర్ పేర్కొన్నారు.