//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సూర్య గ్ర‌హ‌ణంతో అమెరికాలో సౌర విద్యుత్ కు గ్రహణం!

Category : world

సంపూర్ణ‌ సూర్య గ్ర‌హ‌ణంతో విద్యుత్ సరఫరాకు భారీస్థాయిలో విద్యుత్ అంతరాయం ఏర్పడగలదని అమెరికాలో ఆందోళన చెందుతున్నారు. వచ్చే నెల 21న సంభవించే సూర్య గ్రహణం కారణంగా సూర్య విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి అమెరికా అంధ‌కారంగా మారే అవ‌కాశాలున్నాయ‌ని నిపుణులు భావిస్తున్నారు. సుమారు 70 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోగలదని అనుకొంటున్నారు. 

ప‌డ‌మ‌ర రాష్ట్ర‌మైన ఒరిగాన్ నుంచి తూర్పు రాష్ట్ర‌మైన ద‌క్షిణ క‌రోలినా మార్గంలో గ్ర‌హ‌ణ ప్ర‌భావం అధికంగా ఉంటుంది. ఈ రూట్లోనే సుమారు 9,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్ప‌త్తి నిలిచి పోయి, 113 కిలో మీట‌ర్ల మేర విస్తీర్ణంలో అంధ‌కారం ఏర్ప‌డే అవ‌కాశాలున్నాయి. ఆ కారిడార్ రూట్లో ఉన్న సోలార్ ప్యానెల్స్‌కు ఆ రోజున త‌గినంత‌ సౌర శ‌క్తి ల‌భించ‌దు. ఆ విద్యుత్తు శ‌క్తి ఎంత అంటే అది సుమారు తొమ్మిది అణు విద్యుత్తు కేంద్రాలు ఉత్పిత్తి చేసే అంత ఉంటుంద‌ని నిపుణులు అంటున్నారు.

 ఆగ‌స్టు 21న మ‌ధ్యాహ్నాం 1.30 నుంచి 3.40 నిమిషాల వ‌ర‌కు కేవ‌లం న్యూయార్క్‌లోనే 2500 మెగావాట్ల ఉత్ప‌త్తి స‌మ‌స్య‌గా మారుతుంద‌ని చెబుతున్నారు. నార్త్ క‌రోలినా, న్యూజెర్సీ రాష్ట్రాల్లో ఎక్కువ‌గా సోలార్ ప్యాన‌ల్స్ ఉన్నాయి. దాని వ‌ల్ల ఆ రాష్ట్రాల‌కు అధిక ప్ర‌భావం ప‌డే సూచ‌న‌లున్నాయి. 

గ్ర‌హ‌ణం వ‌ల్ల సూర్య ర‌శ్మి త‌గ్గుతుండడంతో సోలార్ ప్యానెల్స్‌కు సుమారు 70 శాతం సూర్య శ‌క్తి త‌గ్గిపోతుంది. ఆ ఫలితంగా ప్యానల్స్ నుంచి విద్యుత్తు ఉత్ప‌త్తి క‌ష్టంగా మారుతుంది. గ్ర‌హ‌ణం వ‌ల్ల ఒక్కొక్క గ్రిడ్డుకు నిమిషానికి 70 మెగావాట్ల విద్యుత్తు త‌గ్గిపోతుంది. అలా ఆ రోజున సుమారు 83 నిమిషాల పాటు త‌క్కువ విద్యుత్తు ఉత్ప‌త్తి కానున్న‌ది.