//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ డ్రస్‌పై సోషల్ మీడియాలో దుమారం

Category : sports

మొన్నామధ్య టీమిండియా పేస్ బౌలర్ షమీ తన భార్యతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పెడితే కొంతమంది రెచ్చిపోయారు. షమీ భార్య స్లీవ్ లెస్ డ్రస్ వేసుకుందని దుమారం రేపారు. మరి అలాంటి వాళ్లే ఇప్పుడు మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పై కూడా అనుచితమైన ట్వీట్లు పెట్టారు. తన సన్నిహితురాళ్లతో కలిసి దిగిన గ్రూప్ సెల్ఫీని పోస్టు చేసిన మిథాలీకి కొంతమంది ఆమె డ్రస్ విషయంలో అభ్యంతరం చెప్పారు.

మిథాలీ రాజ్ అంటే తమకు గౌరవం అంటూనే ఆమె వస్త్రధారణ మాత్రం బాగోలేదని వీరు చెప్పుకొచ్చారు. ఆమె డ్రస్ అసభ్యంగా ఉందని చెప్పుకొచ్చారు. మీరు ఇలాంటి దుస్తుల్లో కనిపిస్తారని మేం అనుకోలేదని కొన్ని ట్వీట్లు వచ్చాయి. మేము మీకు ఫ్యాన్స్ అని చెబుతూనే డ్రస్సింగ్ తీరు మాత్రం సమంజసంగా లేదని మరికొంత మంది మిథాలీ వస్త్రధారణ పట్ల అభ్యంతరం చెప్పారు. వాటికి మిథాలీ రిప్లై ఏమీ ఇవ్వలేదు. కానీ ఆమె ఫాలోయర్లే కొంతమంది ఆమెను సమర్థించారు. మిథాలీ డ్రస్సింగ్ తీరును తప్పు పట్టేవారిది న్యారో మైండ్ సెట్ అని వారు అభిప్రాయపడ్డారు. వస్త్రధారణ విషయంలో మిథాలీకి తన ఇష్టపూర్వకంగా ఉండే స్వతంత్రం ఉందని మిథాలీ ఇండియాకు గర్వకారణమని.. అలాంటి వారి విషయంలో అనుచితంగా మాట్లాడవద్దని మిథాలీ డ్రస్సింగ్ ను తప్పు పట్టే వారికి వీరు హితబోధ చేశారు.