//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పేస్ బుక్ పోస్టింగ్ చేస్తే సస్పెన్షన్ ...సామాజిక నేతల నిరసన

Category : national


సోషల్ మీడియా లో అభిప్రాయలు వ్యక్తం చేయడం పట్ల ప్రభుత్వాలు అసహనంతో వ్యవహరిస్తున్నాయి. తాజాగా చ్చత్తిస్ ఘర్ లో రాయపూర్ జైలు సహాయ సూపరింటెండెంట్ వర్ష డోంగ్రే తన అనుభవాల నుండి పేస్ బుక్ లో ఒక పోస్టింగ్ చేయడంతో రాష్త్ర ప్రభుత్వం సస్పెన్షన్ కు గురి చేయడం దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. 

ఆదివాసీయుల స్థితిగతుల గురించి చట్టబద్ధ సంస్థలు పేర్కొన్న అంశాలనే ఉదాహరిస్తే ప్రభుత్వం ఇటువంటి చర్యకు పాల్పడుతుందా అంటూ మేధా పాట్కర్, అరుణ రాయ్ వంటి పలువురు సామాజిక నేతలు విరుచుకు పడ్డారు. 
ఈ దళిత యువ అధికారిని అడవులలో జవాన్లు, ఆదివాసీయులు, మావోయిస్టు ల జీవితాలను కాపాడే అవకాశం ఉన్నా మృత్యుబాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ హిందీ లో ఒక పోస్టింగ్ పేస్ బుక్ లో పెట్టారు. ఈ ప్రక్రియలో హత్యకు గురవుతున్నది భారతీయ పౌరులే అంటూ పేర్కొన్నారు. ఆ తరువాత ఆమె పోస్టింగ్ ను తీసివేశారు.

సుకుమా జిల్లాలో 25 మంది సి ఆర్ పి యఫ్ జవాన్లు హత్యకు గురైన అనంతరం ఆమె ఈ పోస్టింగ్ చేశారు. అడవులలో ఆదివాసీయులు రాజ్యాంగ రక్షణల ఉల్లంఘనలతో తమ భూమి, అడవి, నదులకు దూరం అవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. మైనర్ గిరిజన బాలికలు పోలీస్ స్టేషన్, జైళ్లల్లో వివస్త్రతకు, ఎలెక్ట్రిక్ షాక్ లకు, లైంగిక-ఇతర వేధింపులకు గురికావడం తాను చూస్తున్నానని అంటూ కూడా తెలిపారు.

పైగా సుప్రీం కోర్ట్, జాతీయ మానవహక్కుల కమీషన్ సీబీఐ, జాతీయ యస్ టి కమీషన్ వంటివి తమ పత్రాలలో పేర్కొన్న అంశాలనే ఆమె ప్రస్తావించారణై అంటూ అరుణ రాయ్, మేధా పాట్కర్ పేర్కొన్నారు.
ప్రభుత్వాలు అనుసరిస్తున్న `అభివృద్ధి విధానం' ఎక్కడా ఘర్షణలను నివారించలేక పోతున్నదని, అందుకనే ప్రజల మధ్య పనిచేస్తున్న ఒక యువ అధికారిని చేసిన వాఖ్యాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని తమ విధానాలను సమీక్షించుకో వలసింది పోయి, ఆమెను సస్పెండ్ చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు.

ఆమె పోస్టింగ్ పై విచారణకు రాష్త్ర ప్రభుత్వం నియమించిన కె కె రాయికు వర్ష రెండు రోజులలోనే తన చర్యను సమర్ధించుకొంటూ 376 పేజీల వివరాలతో ఆమె సమాధానం ఇచ్చారు. అయితే సమాధానం ఇవ్వలేదంటూ సస్పెన్షన్ ఉత్తరువులో పేర్కొన్నారు. ఆమె సమాధానాన్ని కనీసం పరిశీలించకుండా ఆమెను సస్పెండ్ చేయడం అందరికి విస్మయం కలిగించింది.