స్నాప్డీల్ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్నాప్డీల్-ఫ్లి్పకార్ట్ డీల్ నేపథ్యంలో ఉద్యోగులకు 193 కోట్ల రూపాయల మేర నజరానాను అందించాలని స్నాప్డీల్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డీల్ ద్వారా లభించే మొత్తంలో సగానికి సగం మొత్తాన్ని (3 కోట్ల డాలర్లు) ఉద్యోగులందరికీ అందించాలని స్నాప్డీల్ ఫౌండర్లు నిర్ణయించినట్లు తెలిపింది. ప్రస్తుతం స్నాప్డీల్లో 1,500-2,000 మంది ఉద్యోగులున్నారు. కంపెనీ ఉద్యోగులందరికీ 193 కోట్ల రూపాయలతో సెటిల్మెంట్ చేసేందుకు అనుమతినివ్వాలని సంస్థ ఫౌండర్స్.. బోర్డును కోరారు. గడచిన ఏడాది కాలంలో కంపెనీని వదిలివెళ్లిన సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు ఈ న జరానాను అందించాలని స్నాప్డీల్ భావిస్తోంది. ఈ డీల్ ద్వారా స్నాప్డీల్ ఫౌండర్స్ అయిన కునాల్ బహాల్, రోహిత బన్సాల్ 6 కోట్ల డాలర్లు అందుకుంటున్న సంగతి తెలిసిన విషయమే.