Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్నాప్ చాట్ కు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న ఇండియన్స్

Category : world national business

భారత్, స్పెయిన్లపై స్నాప్ చాట్ సీఈవో ఇవాన్ స్పీగల్ చేసిన సంచలన వ్యాఖ్యలు కంపెనీకి భారీగా దెబ్బకొడుతున్నాయి. ట్విట్టర్లో ఇప్పటికే ఈ కంపెనీపై పలు రకాలుగా కామెంట్లు వెల్లువెత్తుతుండగా.. చాలామంది తమ మొబైల్ నుంచి స్నాప్ చాట్ ను అన్ ఇన్ స్టాల్ చేసేస్తున్నారు. అంతేకాక యాప్ స్టోర్ లోనూ కంపెనీ రేటింగ్స్ కూడా భారీగా పడిపోతున్నట్టు తెలిసింది. యాప్ స్టోర్ లో అంతకమునుపు 'ఫైవ్ స్టార్' రేటింగ్ ను సంపాదించుకున్న స్నాప్ చాట్ ఆ రేటింగ్ ను ఒక శాతానికి పడగొట్టుకుంది. యాప్ స్టోర్ లోని యాప్ సమాచారం ప్రకారం ప్రస్తుత వెర్షన్ కున్న కస్టమర్ రేటింగ్స్ ఆదివారం ఉదయానికి 'సింగిల్ స్టార్' నమోదైనట్టు తెలిసింది. మొత్తం వెర్షన్ల రేటింగ్ కూడా 'వన్ అండ్ ఆఫ్ స్టార్' మాత్రంగానే ఉన్నట్టు వెల్లడైంది. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో మాత్రమే 'ఫోర్ స్టార్' దక్కించుకుంది.