మాములుగా పాముని చుస్తే ఆమడ దూరంలో ఉంటాం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా పాముని ముద్దాడటానికి ప్రయత్నించి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. న్యూయార్క్‌లోని పుత్నం కౌంటీలో రాన్ రీనాల్డ్ అనే వ్యక్తి రాటిల్‌స్నేక్‌ను ముద్దుపెట్టుకోవడాని దానిని పట్టుకున్నాడు. పామును కిస్ చేయడానికి ప్రయత్నించగా అది నాలుకపై కాటువేసింది. అది తెలుసుకున్న అధికారులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ వెల్లడించారు. " పాముని పట్టుకున్నప్పుడు అది నిశ్శబ్ధంగా ఉందని..కిస్ చేసే సమయంలో అది నాలుకపై కాటువేసిందని" అతని సన్నిహితుడొకరు చెప్పాడు.