డ్రగ్స్ స్మగ్లింగ్ " ప్రపంచంలో ఏదొక మూల నిత్యం ఇది జరుగుతూనే ఉంటుంది.
ప్రపంచంలో కష్టమైనా లాభసాటి వ్యాపారం కావడంతో దీని వ్యాపారులు కూడా గణనీయంగా పెరిగిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా దీనికి డిమాండ్ ఉండటంతో స్మగ్లింగ్ కూడా తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఏదొక రూపంలో ఈ డ్రగ్స్ ని తయారీదారులు చేరవేస్తూ ఉంటారు.
ఇందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. కొందరు శరీరం లోపల దాచుకుంటే మరికొందరు తమ బూట్లు ఇలా ఏదొక ప్రదేశంలో దానిని దాచి సరఫరా చేస్తూ ఉంటారు. తాజాగా ఒక యూరోపియన్ దీని స్మగ్లింగ్ వింటే నోరెళ్లబెట్టడం ఖాయం. ఇప్పటి వరకు పండ్ల జోలికి వేళ్ళని స్మగ్లర్లు దీని స్మగ్లింగ్ కోసం అరటి పండుని కూడా ఎంచుకున్నారు.
దాదాపు 2 కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలను యూరోపియన్ దేశం నుంచి తీసుకువచ్చిన దుబాయ్ లో అధికారులకు పట్టుబడ్డారు. అచ్చం అరటి పండ్ల లా ఉన్న ఒక నమూనాలో దానిని ప్యాక్ చేసి తరలిస్తుండగా అధికారులు 80 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే వారు ఏ దేశానికి చెందిన వారు అనేది అధికారులు వెల్లడించలేదు.