ఇదేంటి పావురం అరెస్ట్ అని ఆశ్చర్య పోతున్నారా ...ఇది నిజగానే జరిగింది. కువైట్ పోలీసులు ఓ పావురాన్ని అరెస్ట్ చేశారు. పావురాన్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే...ఆ పావురం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయింది. కువైట్ సరిహద్దు ప్రాంతమైన ఇరాన్ నుండి కువైట్ వైపు ఓ పావురం రావడం పోలీసులు గమనించారు. మొదట ఆ పావురాన్ని అంతగా పాటించుకోలేదు కానీ దానికి ఓ చిన్న బ్యాగ్ లాంటిది తగిలించాడని గమనించిన పోలీసులు వెంటనే దాన్ని పట్టుకుని బ్యాగ్ విప్పి చూడగా అందులో ఉత్ప్రేరక ఔషధాలు లభించాయి. దాంతో అక్రమంగా ఉత్ప్రేరకాలను స్మగ్లింగ్ చేస్తున్నారన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పావురాల ద్వారా ఇలా స్మగ్లింగ్ చేయించడం ఇది మొదటిసారి కాదు. 2015లో కోస్టారికాకు చెందిన పోలీసులు ఎగరలేకపోతున్న ఓ పక్షిని పట్టుకున్నారు. తీరా చూస్తే దాని పొట్టకి కొకైన్ పొట్లాలు తగిలించి ఉండడం చూసి కంగుతిన్నారు.