//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్మృతి ఇరానీకి మళ్లీ డిగ్రీ చిక్కులు

Category : national politics

మరోసారి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలకు సంబంధించిన కేసు తెరమీదకు వచ్చింది. కిందిస్థాయి కోర్టులో ఆమెకు ఉపశమనం లభించినా హైకోర్టులో మాత్రం మరోసారి ఈ కేసు విచారణ మొదలైంది. ఆమె విద్యార్హతలకు సంబంధించిన పత్రాలన్ని కోర్టుకు సమర్పించాలంటూ స్పష్టం చేసింది. వాటిని పరిశీలించిన తర్వాతే ఎవరికి సమన్లు ఇవ్వాలనే విషయం నిర్ణయిస్తామని తెలిపింది. 

స్మృతి ఇరానీ విద్యార్హతలపై మరో కేసు నమోదైంది. వేర్వేరు ఎన్నికల అఫిడవిట్లలో ఆమె తెలిపిన విద్యార్హతల  సమాచారం పరస్పర విరుద్ధంగా ఉందని అహ్మర్ ఖాన్ ఢిల్లీ హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఖాన్ గతంలో ట్రయల్ కోర్టులో ఇటువంటి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ట్రయల్ కోర్టు స్పందిస్తూ మంత్రిని వేధించేందుకే ఖాన్ ఈ ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. సుదీర్ఘ కాలం గడచిపోయినందువల్ల విశ్వవిద్యాలయాల రికార్డులు అందుబాటులో ఉండకపోవచ్చుననే ఉద్దేశంతో ఈ ఫిర్యాదు చేసినట్లు గుర్తించింది.

ఇదిలావుండగా, ఢిల్లీ హైకోర్టు అహ్మర్ ఖాన్ ఫిర్యాదును విచారణకు స్వీకరించింది. ట్రయల్ కోర్టు నుంచి రికార్డులను తనకు అందజేయాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబరు 13న జరుగుతుందని పేర్కొంది.

2004, 2014 లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ పోటీ చేశారు. ఈ ఎన్నికల నామినేషన్లతో పాటు సమర్పించిన విద్యార్హతల సమాచారంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తప్పుడు అఫిడవిట్లను సమర్పించినట్లు రుజువైతే, దోషికి 6 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా ఈ రెండు శిక్షలు విధించవచ్చునని ప్రజా ప్రాతినిథ్య చట్టం సెక్షన్ 125ఏ చెప్తోంది.