ఈ మధ్య క్రికెట్ లో వినిపిస్తున్న మరో వివాదం బాల్ ట్యాంపరింగ్. బాల్ ట్యాంపరింగ్ వివాదానికి సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల మధ్య జరిగే టెస్ట్ సిరీస్ లో బయటపడింది. ఈ వివాదం లో దోషులుగా వున్నాస్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లను ఐసీసీ, సీఏ ఏడాది నిషేదం విధించింది.
దీనితో ఇప్పుడు వారికీ మరో షాక్ కూడా తగిలింది. ఐపీఎల్ నుండి కూడా వారిని బీసీసీఐ నిషేదించింది. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్మిత్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ లపై ఐసీసీ, సీఏ చర్యల కోసం వేచి చూశామని బీసీసీఐ తెలిపింది.
ఆ తరువాత వారిద్దరినీ తక్షణమే ఐపీఎల్ నుంచి నిషేధిస్తున్నామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. స్మిత్ స్థానంలో రహానే కెప్టెన్ బాధ్యతలు స్వీకరించగా, వార్నర్ స్థానంలో ధావన్ పగ్గాలు చేపట్టనున్నాడని తెలుస్తోంది.