//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అడ్డంగా దొరికిపోయిన కామ్రాన్....ఇబ్బంది లో ఆస్ట్రేలియా కెప్టెన్

Category : sports

దక్షిణఆఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ ఓపెనర్ కామరాన్ బాన్ క్రాఫ్ట్ అడ్డంగా దొరికిపోవడంతో ఆస్ట్రేలియా కెప్టెన్, వైస్ కెప్టెన్ పదవుల నుంచి స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ తప్పుకోవాలని ఒత్తిడి వస్తున్న నేపధ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకుంది.

వారిని పదవుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. శనివారం దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కెమరాన్ ఓ చిప్ లాంటి పరికరంతో బంతిని ట్యాoపరింగ్ చేస్తూ వీడియో కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. గమనించిన అంపైర్లు అతడిని వివరణ కోరగా తన జేబులో ఏమీ లేదంటూ కళ్లద్దాలు పెట్టుకునే చిన్న సంచిని తీసి చూపించి అమాయకంగా వెళ్ళిపోయాడు.

అయితే అతడు బాల్ ట్యాoపరింగ్ కు పాల్పడినట్టు కెమెరాల్లో స్పష్టంగా కనబడటంతో ఐసీసీఐ అతడిపై ఓ మ్యాచ్ నిషేధంతోపాటు మ్యాచ్ ఫీజులో వందశాతం కొత్త విధించింది. అనంతరం స్టీవ్ స్మిత్ అతనితో కలసి మీడియా సమావేశంలో పాల్గొని బాల్ ట్యాoపరింగ్ కు పాల్పడినమాట వాస్తవమేనని కెప్టెన్ స్టీవ్ స్మిత్ అంగీకరించాడు. ఈ మ్యాచ్ తమకు కీలకమని అందుకే అలా చెయ్యాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు.

Related News