ప్రసిద్ధ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ప్రేరణతో హైదరాబాద్కు చెందిన స్మార్ట్రాన్ విపణిలోకి ఒక స్మార్ట్ఫోన్ ‘ఎస్ఆర్టీఫోన్’ను విడుదల చేసింది. ఈ ఫోన్ను దేశీయంగా డిజైన్ చేసి, ఇక్కడే తయారు చేస్తున్నామని, సచిన్ అభిమానులకు ఆయన నుంచి ఇదో బహుమతి అని స్మార్ట్రాన్ ఇండియా వ్యవస్థాపకుడు, ఛైర్మన్ మహేశ్ లింగారెడ్డి తెలిపారు. క్రికెట్గాడ్ తెండూల్కర్ ఈ ఫోన్ను విపణిలోకి విడుదల చేశారు. స్మార్టాన్ కంపెనీ ఎస్ఆర్టీ.ఫోన్ పేరుతో రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్ఫోన్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. టిటానియం గ్రే కలర్ వేరియంట్ స్మార్ట్ఫోన్ను నేటి నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా వినియోగదారులకు లభ్యం కానుంది. 32జీబీ వేరియంట్ ధర రూ.12,999గా నిర్ణయించగా, 64జీబీ వేరియంట్ ధర రూ.13,999గా ప్రకటించారు.
ఫోన్ ఫీచర్లు 5.5 అంగుళాల తాకే తెర ,ఆండ్రాయిడ్ 7.0 నోగట్ ,652 ఆక్టా కోర్ స్నాప్డ్రాగన్ కోర్ ప్రొసెసర్,4జీబీ ర్యామ్,13 మెగాపిక్సల్ వెనుక కెమెరా ,5 మెగాపిక్సల్ ముందు కెమెరా ,64జీబీ అంతర్గత మెమరీ , 3000ఏంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం అని స్మార్ట్రాన్ ఇండియా వ్యవస్థాపకుడు, ఛైర్మన్ మహేశ్ లింగారెడ్డి తెలిపారు.