//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చెత్తకుండీ నుండి అసిస్టెంట్ కమిషనర్‌ గా...

Category : state national


కడుపులో పెట్టుకొని పెంచాలిచ్చిన కన్నతల్లే తన కూతుర్ని చెత్తకుండలో పడేసింది. ఆ పాపా అదృష్టం బాగుండి అటునుంచి వెళుతున్న ఓ చిరు వ్యాపారి ఆ పాపకి తండ్రి అయ్యాడు. బాగా చదివించి పెద్ద చేసి అసిస్టెంట్ కమిషనర్‌ హోదాలో నిలబెట్టాడు. ఆ పాపా వచ్చిన తరువాత అతని జీవితమే మారిపోయింది. అసోంలోని తీన్ సుఖియా జిల్లాలో జరిగింది ఈ సంఘటన. Slum to Assistant commissioner

అసలు విషయానికివస్తే సోబరన్‌‌ అనే వ్యాపారి కురగాయలను బండిమీద పెట్టుకొని వీధివీధి తిరుగుతూ అమ్ముతుండేవాడు. తన తల్లితండ్రుల వయస్సు పెద్దది కావడంతో వాళ్ళని చూసుకొనే పనిలో పెళ్లికూడా చేసుకోలేదు. ఒకరోజు తాను కూరగాయలు అమ్మి ఇంటికి వస్తున్నా టైములో ఓ పసికందు చెత్తకుప్పలో ఏడుస్తూ కనిపించింది. అది గమనించిన సోబరన్‌‌ వెంటనే పాపను తీసుకొని ఏజన్మ బంధమో నాకోసమే పుట్టిందేమో అనుకుని చాల ఆనందపడ్డాడు. అమ్మానాన్నా తానై పెంచి బాగా చదివించాడు.ఇప్పుడు ఆ పాప అసిస్టెంట్ కమిషనర్ అయ్యానంటూ తనకి ఉద్యోగం వచ్చిన ఆర్డర్స్ తండ్రి సోబరన్ చేతిలో పెట్టింది.Slum to Assistant commissioner

రక్తం పంచుకొని పుట్టకపోయిన ఆ పాపకి జ్యోతి అనే పేరుపెట్టి, మంచి స్కూల్లో జాయిన్ చేసి, బాగా చదివించాడు సోబరన్. కష్టం తెలియకుండా, కన్నీళ్లు రానివ్వకుండా జ్యోతిని పెంచి పెద్ద చేశాడు. బాగా చదివిన జ్యోతి కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పట్టా తీసుకుంది. ఆతరువాత అసోం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్వూలో కూడా విజయం సాధించి ఇన్ కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందుకుంది. అది తెలుసుకున్న తండ్రి చాల ఆనందపడ్డాడు. వీధిపాలు కావలసిన తనని బాగా చదివించి ప్రపంచం ముందు విజేతగా నిలబెట్టిన తండ్రికి మనసులోనే ధన్యవాదాలు తెలిపింది. Slum to Assistant commissioner

Related News