బెంగూళూరు టీం యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇంట్లో కోహ్లి టీం సందడి చేశారు. నిన్న హైదరాబాద్ వర్సెస్ బెంగుళూరు మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన బెంగళూరు టీం తన ఇంటికి ఆహ్వానించాడు మహ్మద్ సిరాజ్. సిరాజ్ స్వస్ధలం హైదరాబాద్ కావడంతో.. సరాదాగా టోలిచౌకిలో ఉన్న తన ఇంటికి పిలిచి రెండు గంటలపాటు ఎంజాయ్ చేశారు. తమ తొటి ఆటగాళ్లకు హైదరాబాద్ బిర్యాని రుచి చూపించాడు. బెంగుళూరు ఆటగాళ్లు సిరాజ్ ఫ్యామితో కాసేపు సరదాగా గడిపారు. విరాట్ కోహ్లి , చాహల్, పార్ధివ్ పటలే, ఉమేష్ యాదవ్ పలువురు ఆటగాళ్లు ఈ విందులో పాల్గోన్నారు. హైదరాబాదీ స్టైల్లో అందరూ కింద కూర్చోని బిర్యానీ, రోటీలు తిన్నారు.
సిరాజ్ ఇంట్లో కోహ్లి సేన బిర్యాని తిన్న విడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిరాజ్ హైదరాబాద్ వాసి అయిన అతనిని బెంగుళూరు టీం వేలంలో తీసుకుంది. బెంగళూరు టీం సిరాజ్ ను కోటి రూపాయలకు సొంతం చేసుకుంది. ఈసిజన్ లో సిరాజ్ తగినంత ప్రదర్శన చూపియకపోవడంతో అతనిపై కొంచెం ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తుంది. గత ఐపిఎల్ మ్యాచ్ లో సిరాజ్ హైదరాబాద్ తరపున ఆడిన విషయం తెలిసిందే. ఈ సిజన్ లో సిరాజ్ ప్రదర్శన సరిగా లేకపోవడంతో పాటు బెంగుళూరు టీం కూడా సరిగ్గా ప్రతిభ కనబర్చకపోవడం వల్ల బెంగళూరుకు అన్ని అపజయాలే ఎదురవుతున్నాయి.