//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీ, అమిత్ షా పై శత్రుఘ్ను సిన్హా ఫైర్ ..?

Category : national

బీజేపీ అధినాయకత్వంపై ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్నుసిన్హా మరోసారి ఫైరయ్యారు. తరుచు ఏదో ఒక విమర్శ చేసే ఆయన ఈ సారి కాస్త ఘాటుగానే మండిపడ్డారు. వన్ మేన్ షో- టు మేన్ ఆర్మీ కి స్వస్తి చెప్పాలని అన్నారు. బీజేపీ ప్రస్తుత విధానాల వల్ల యువకులు, రైతులు, వ్యాపారులు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన .. బీజేపీని వదిలిపెట్టేందుకు అందులో చేరలేదని బదులిచ్చారు. అయితే శత్రుఘ్ను సిన్హా వ్యాఖ్యలు మోడీ, అమిత్ షా ను ఉద్దేశించి చేసినవనే అని అభిప్రాయాలకు తావిస్తోంది.