//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మేము పాడే పాటలపై మాకు రాయల్టీ కావాలి: సింగర్స్

Category : movies

ఇప్పటివరకు ప్రతి సినిమా పాటలపై, నిర్మాతకు, సంగీత దర్శకుడికి, గేయ రచయితలకు మాత్రమే హక్కులు ఉండేవి. అయితే 2012 లో వచ్చిన రాయల్టీ చట్టం గాయనీ గాయకులకు కూడా వారు పాడే పాటలపై హక్కులు కలిపించింది. ఇదే విషయమై రాయల్టీ చట్టాలపై గాయనీగాయకులంతా అవగాహన కలిగి వుండాలని చెప్పారు ప్రముఖ నేపధ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం. ఇప్పటి వరకు తనకు ఒక్క రూపాయి కూడా రాయల్టీ క్రింద రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాయల్టీ చట్టం ప్రకారం పాట లాభాల్లో గాయనీ గాయకులకు వాటా చెల్లించాలన్న బాలు తన పాటలకు రాయల్టీ చెల్లిస్తే ఎప్పుడో రిటైర్ అయ్యేవాడినని చమత్కరించారు.

ఇండియన్‌ సింగర్స్‌ రైట్స్‌ అసోసియేషన్‌(ఇశ్రా) సమావేశంలో రాయల్టీ ఈ చట్టంపై చర్చించారు. గాయనీ గాయకులంతా ఐక్యమై రాయల్టీని తీసుకోవాలని కోరారు. రాయల్టీ అనేది కేవలం సినిమా పాటలకే కాకుండా అన్ని రకాల పాటలకు వర్తిస్తుందన్నారు . ఒక పాటను రీ-మిక్స్ చేయాలంటే ఐపీఆర్‌ఎస్‌ నుంచి పర్మిషన్‌ తీసుకోని చేయాలని, కానీ అలా జరగటం లేదన్నారు.

బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఒక లతా మంగేష్కర్‌ మాత్రమే పాట ఒప్పందంలో రాయల్టీ వచ్చేలా కాంట్రాక్ట్ చేసుకునేవారని వివరించారు. ఇక నుండి పాటల విషయంలో రాయల్టీ యాక్ట్ ప్రకారం ముందుకు వెళ్ళాలి పేర్కొన్నారు. అదే విధంగా చనిపోయిన సింగర్లు పాడిన పాటలకు కూడా రాయల్టీ వస్తుందని అయితే, ఇందుకు సదరు సింగర్‌ కుటుంబ సభ్యులు ఇశ్రాలో సభ్యులు అయి ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో దాదాపు 410 మంది సింగర్‌లు ఉన్నట్లు చెప్పారు.